సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా–2022 జాతీయ పోటీలకు ఏపీ క్రీడాకారుల బృందం సమాయత్తం అవుతోంది. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు అండర్–19 బాలబాలికల విభాగంలో దేశ వ్యాప్తంగా క్రీడాకారులు పోటీపడనున్నారు. ఇందులో 13 క్రీడాంశాల్లో ఏపీ బృందం అర్హత సాధించగా 87 మంది క్రీడాకారులు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఖేలో ఇండియాకు వెళ్తోన్న క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. రెండు వారాల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని స్పెషల్ కోచ్‌లతో క్రీడాకారులకు శిక్షణ అందించనుంది.
ఇక్కడే ప్రత్యేక శిక్షణ
ఖేలో ఇండియా పోటీల్లో క్రీడాకారులు పతకాలు సాధించేలా శాప్ ప్రోత్సహిస్తోంది. 53 మంది బాలురు, 32 బాలికల క్రీడాకారులతో ప్రత్యేక శిక్షణ క్యాంప్‌నకు శ్రీకారం చుట్టింది. అథ్లెటిక్స్ (ఏఎన్‌యూ), షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ (కాకినాడ డీఎస్‌ఏ), స్విమ్మింగ్ (ఈడుపుగల్లు), జూడో (అనకాపల్లి డీఎస్‌ఏ), బాక్సింగ్ (విజయనగరం డీఎస్‌ఏ), బ్యాడ్మింటన్, కానోయింగ్ అండ్ కయాకింగ్, ఆర్చరీ (విజయవాడ), ఖోఖో, జిమ్నాస్టిక్స్ (బీఆర్ స్టేడియం గుంటూరు), మల్లఖంబ (భీమవరం), గటక్ (రేణిగుంట)లో ఈ నెల 17 నుంచి కోచింగ్ క్యాంప్‌ను ప్రారంభించనుంది.
క్రీడాకారులకు డీఏ
ఖేలో ఇండియా–2022 జాతీయ పోటీలు మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, గ్వాలియర్, ఉజ్జయిని, జబల్‌పూర్, మండల, బాలాఘాట్, ఖర్గోన్ వేదికగా జరగనున్నాయి. భారత క్రీడా ప్రాధికార సంస్థ క్రీడాకారులకు ప్రయాణ సౌకర్యాన్ని కలి్పస్తుండగా ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్క క్రీడాకారుడికి నేరుగా డీఏను అందించనుంది. ఖేలో ఇండియాకు అత్యధికంగా బాక్సింగ్‌లో 10 మంది, మల్లఖంబలో 12 మంది, వెయిట్ లిఫ్టింగ్‌లో 19 మంది క్రీడాకారులు ఏపీ నుంచి అర్హత సాధించడం విశేషం.
పతకాలు నెగ్గేలా తర్ఫీదు
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. జాతీయ స్థాయిలో జరిగే ప్రతి మీట్‌లో పతకాలు సాధించేలా తరీ్ఫదును అందిస్తున్నాం. ఈ సారి ఖేలో ఇండియా పోటీల్లో అర్హత సాధించిన క్రీడాంశాలతో పాటు వయిల్‌కార్డ్ ద్వారా పాల్గొన్న క్రీడాకారులు కూడా కచి్చతంగా పతకం నెగ్గేలా ప్రణాళిక రూపొందించాం. అందుకే రాష్ట్రంలోని నిపుణులైన కోచ్‌లతో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం.
– ఆర్కే రోజా, పర్యాటక, క్రీడా శాఖ మంత్రి.
Comments
Please login to add a commentAdd a comment