ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘స్వరనిధి స్వర వీణాపాణి’ విశ్వ విజయోత్సవ సభ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాస భారతీయులు, సంగీత సాహిత్య ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేశారు.
ఈ సందర్భంగా తానా కళాశాల చైర్మన్ రాజేష్ అడుసుమిల్లి మాట్లాడుతూ.. కళాశాల ప్రారంభం నుంచి ఎంతోమంది నృత్య కళాకారులకు, కూచిపూడి నృత్యంలో పట్టభద్రులు అవ్వడానికి సహకారం అందించడంతో పాటు మన్ముందు ఆసక్తి గల విద్యార్థులకు ప్రోత్సాహం ఉంటుందని అన్నారు.
తానా తెలుగు భాషా పరివ్యాప్తి కమిటి చైర్మన్ చినసత్యం వీర్నపు స్వరవీణాపాణితో వున్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. 2018లో ‘సప్తస్వర అష్టావధానం’ నిర్వహించడానికి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలో 72 మేళకర్త రాగాల స్వరూపం మొత్తాన్ని ఒక సంక్షిప్త కీర్తనలో పొందుపరచి, 61 గంటలపైగా పాడి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అవార్డును సొంతం చేసుకున్న స్వరవీణాపాణి గిన్నీస్ రికార్డు అందుకోవడం తెలుగు జాతికి గర్వకారణం అని ప్రశంసల వర్షం కురిపించారు.
వీణాపాణి మాట్లాడుతూ తనకు డాక్టర్ ప్రసాద్ తోటకూరని, తనికెళ్ళ భరణి పరిచయం చేశారని, వారితో అనుబంధం జీవితంలో మరువలేనిది అని అన్నారు. అలాగే వెన్నం ఫౌండేషన్ అధినేత మురళీ వెన్నం, ప్రసాద్ తోటకూరలు ప్రోత్సాహం, ఆదరాభిమానాలు తనను ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అవార్డు దక్కించుకునేందుకు దోహదం చేశాయని కొనియాడారు.
లోకేష్ నాయుడు, మురళీ వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, అశోక్ కొల్లా, చినసత్యం వీర్నపు, డా. ఊరిమిండి నరసింహారెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డా. భానుమతి ఇవటూరి , లక్ష్మి పాలేటి, శరత్ యర్రం (టాంటెక్స్ అధ్యక్షులు), వెంకట్ ములుకుట్ల, పరమేష్ దేవినేని, సాంబయ్య దొడ్డ, వెంకట ప్రమోద్, కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్, లెనిన్ వేముల,సుందరరావు బీరం, బాపూజీ జంధ్యాలలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి దాతలు, మైత్రి రెస్టారెంట్ యాజమాన్యానికి, మీడియా సంస్థలకు, కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు మురళీ వెన్నం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment