తెలుగు, సాహితీ ప్రియులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు! | Sankranti Wishes To Telugu and literature lovers | Sakshi
Sakshi News home page

తెలుగు, సాహితీ ప్రియులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!

Published Wed, Jan 15 2025 1:50 PM | Last Updated on Wed, Jan 15 2025 1:54 PM

Sankranti Wishes To Telugu and literature lovers

తానా సంస్థ సాహిత్యవిభాగంగా మే, 2020 న ఆవిర్భవించిన “తానా ప్రపంచసాహిత్య వేదిక ‘నెలానెలా తెలుగువెలుగు’ పేరిట విభిన్న సాహిత్యాంశాలతో ప్రతినెల ఆఖరి ఆదివారం (భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 లకు) మేము నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలకు మీరు చూపిస్తున్న ఆదరణకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. 

మీ విశేష ఆదరాభిమానాలు, సూచనలు, సలహాలతో “తానా ప్రపంచసాహిత్యవేదిక్ఙ నేడు ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మక అగ్రగామి సాహిత్యసంస్థగా రాణిస్తోంది. ఈ ఉన్నతస్థితికి ఎదగడానికి తోడ్పడిన తానా కార్యవర్గసభ్యులకు, కార్యకర్తలకు, సాహితీ ప్రియులకు, ప్రసారమాధ్యమాలకు మా వినమ్రపూర్వక ప్రణామములు. 

2020 మే నెలలో ప్రజాకవి వంగపండు ప్రసాదరావు గారి జానపద కార్యక్రమంతో ప్రారంభమైన మా ఈ తానా ప్రపంచసాహిత్యవేదిక అప్పటినుండి ఇప్పటివరకు అంటే డిసెంబర్ 31, 2024 వరకు 75 విభిన్న సాహిత్యాంశాలమీద, 360 గంటల 5 నిమిషాల 43 సెకండ్ల నిడివిగా సాగింది. పాల్గొన్న మొత్తం అతిథులు, సాహితీవేత్తలు, అవధానులు, రచయితలు, రచయిత్రులు, కవులు, కళాకారులు 1,625 మంది. ఈ మొత్తం 75 సాహిత్య కార్యక్రమాల గొలుసుకట్టు యూట్యూబ్ లంకెను ఈ క్రింద పొందుపరుస్తున్నాము. మీకు వీలున్నప్పుడు వీక్షించగలరు. 

https://www.youtube.com/watch?v=g5J-BD0XdCA&list=PL0GYHgMt2OQzhobYN7BUnlSR9LBS7Xlm8

సాహిత్యాభివందనాలతో.. డా. ప్రసాద్ తోటకూర, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు; నిరంజన్ శృంగవరపు, తానా అధ్యక్షులు; చిగురుమళ్ళ శ్రీనివాస్, తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement