అట్లాంటా, జార్జియా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వర్చువల్‌గా నిర్వహించిన ప్రఖ్యాత సాహితీవేత్తలతో ప్రత్యక్ష పరిచయాలు ప్రత్యేక అనుభవాలు అనే సాహిత్య కార్యక్రమం విజయవంతంగా సాగింది. సాహిత్య ప్రపంచంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న విశ్వనాథ సత్యనారాయణ, ఆచార్య ఆత్రేయ, శ్రీ శ్రీ, సిరివెన్నెల సీతారామశాస్త్రిలు సృష్టించిన సాహిత్యం కాకుండా వారి జీవితాలలోని అనేక మలుపులు, స్ఫూర్తిదాయకమైన అంశాలపై ఈ సదస్సులో చర్చించారు.
తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు స్వాగాతోపన్యాసంలో విశిష్ట అతిధులందరినీ ఆహ్వానించారు. డాక్టర్ ప్రసాద్ తోటకూర, చిగురుమళ్ళ శ్రీనివాస్‌లను ఆయను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ప్రముఖ సాహితీవేత్తల పేర్లు, వారు సృష్టించిన సాహిత్యం మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ వారి జీవితాలలో ఎదురైన అవరోధాలు, ఎదుర్కొన్న సవాళ్లు, వారి కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఆర్ధిక ఇబ్బందులు ఎన్నో ఉంటాయన్నారు. వాటన్నింటీ ఎంతో నిబద్ధతతో తట్టుకుని, సాహిత్య లోకంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వారు ఎలా సాధించారనేది ఎప్పటికీ ఆసక్తిదాయకమే అన్నారు. ఇలాంటి అంశాలు ఈ తరానికి తెలియడం ఎంతో అవసరం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment