అట్లాంటా: పుస్తక మహోద్యమాన్ని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు గురువారం అట్లాంటా నగరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులకు వివిధ పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భద్రాచలంలో ఈ కార్యక్రమం మొదలైందన్నారు. ఈ పుస్తక మహోద్యమానికి సాహితీ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, రచయితలు, పాఠకుల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమం వచ్చే సంక్రాంతి పండుగ వరకు ఒక ఉద్యమంగా మారుతుందన్నారు.
పుస్తకాలను కొని మిత్రులకు, బంధువులకు, పిల్లలకు బహుమతులుగా అందించే అక్షరాల పండుగే పుస్తక మహోద్యమమం అని తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment