వాషింగ్టన్ : ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడానికి తానా అధ్యక్షులు జయ తాళ్ళూరి అధ్వర్యంలో ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహొత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తముగా 100కి పైగా తెలుగు సంఘాలు భాగస్వాంతో వర్చువల్ పద్దతిలో నిర్వహిస్తన్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే 12000 మందికి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకొని పోటీలకు సిద్దమవుతున్నారు. 3 సంవత్సరాల నుండి 60కిపైగా వయసున్న వారు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చు. మహోత్సవాన్ని 8 భాగాలలో 33 విభాగాలలో నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ తూనుగుంట్ల శిరీష చెప్పారు. 500 మందికి పైగా నిష్ణాతులైన న్యాయనిర్ణేతలు పాల్గొంటున్న ఈ కార్యక్రమమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పాల్గోనున్నారు.
పోటీలు జరిగే విభాగాలు:
1.సౌందర్యలహరి
ఫ్యాషన్ షో - లిటిల్ ప్రిన్స్ మరియు ప్రిన్సెస్ - 3 నుండి12 సంవత్సరాల వయస్సు వారికి
బ్యూటీ పేజెంట్ – టీన్ – 13 నుండి19 సంవత్సరాల వయస్సు వారికి
బ్యూటీ పేజెంట్ – మిస్ – 20 నుండి 28 సంవత్సరాల వయస్సు వారికి
బ్యూటీ పేజెంట్ – మిస్సర్స్ – 29 నుండి వయస్సు వారికి
2. తెలుగు వెలుగు
తెలుగు పద్యాలు
సామెతలు వివరణ
పరభాష లేకుండా పలుకు
చందమామ కధలు
3. రాగమంజరి
జానపద సంగీతం
శాస్త్రీయ సంగీతం
లలిత గీతాలు / సినీ గీతాలు
4. నాదామృతం
వీణ, వయొలిన్, మృదంగం, ఫ్లూట్, తబలా, కీబోర్డు, గిటార్
5. అందెల రవళి
జానపద నృత్యం
శాస్త్రీయ నృత్యం
పాశ్చాత్య నృత్యం
6. కళాకృతి
రంగవల్లి
చిత్రలేఖనం
అల్లికలు
వ్యంగ చిత్రలేఖనం
బంకమట్టి అచ్చులు, సైకత శిల్పాలు
7. రంగస్థలం
మూఖాభినయం
ఏకపాత్రాభినయం
ఇద్దరు లేక ముగ్గురితో సన్నివేశ నటన
8. భువన విజయం
తెలుగు ఐఖ్యరాజ్య సమితి
ఈ పోటీలు 24,25, 26 తేదీల్లో జరగనున్నాయి
Comments
Please login to add a commentAdd a comment