సాక్షి, హైదరాబాద్: భాషాభివృద్ధికి పత్రికలు చేసే కృషి అనేక రూపాల్లో ఉంటుందని ‘సాక్షి’ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి చెప్పారు. గడిచిన 200 ఏళ్ల చరిత్రలో పత్రికలు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశాయన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఆన్‌లైన్ వేదికగా ‘తెలుగు పత్రికలు–తెలుగు భాషా ప్రామాణికత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. పత్రికలు చేసే భాషాప్రయోగం వల్ల భాషకు నష్టం జరుగుతుందనే వాదన సరైంది కాదన్నారు.
తెలుగులోనే కాకుండా ఇతర భాష ల్లోనూ పత్రికల వల్ల ఆయా భాషలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. డిజిటల్ మీడియా విస్తరిస్తున్న క్రమంలో భాషకు ఏకరూపత ఉండాలని, ప్రభుత్వం, అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ ఆ పని చేయాలన్నారు. తానా పూర్వ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, ఎం.నాగేశ్వర్‌రావు, సతీష్‌చందర్, శ్రీరామ్మూర్తి, తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, సమన్వయకర్త శ్రీనివాస్ పాల్గొన్నారు.
చదవండి: తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ అధ్వర్యంలో ఉగాది వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment