r dileep reddy
-
‘కాప్’లో లాబీలు – ఆశలపై చన్నీళ్లు!
ప్రతి మనిషిని ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పు ప్రమాద నేప«థ్యంలో... భూతాపోన్నతి కట్టడికి ప్రపంచ దృష్టినాకర్షించిన కాప్–26 సదస్సు, అట్టహాసంగా మొదలై, ఆశించిన ఫలితాలు లేకుండానే ముగిసింది. కర్బన ఉద్గారాల నికర శూన్యస్థితి ఎప్పటికో... కానీ, ప్రతిష్టాత్మక భాగస్వాముల సదస్సు, ఫలితాలు రాబట్టడంలో మాత్రం ‘నికర శూన్యస్థితి’ని సాధించింది. అగ్ర–సంపన్న దేశాలు పెద్ద హామీలు గుప్పించి నిర్దిష్ట కార్యాచరణకు కట్టుబడకుండానే బయటపడ్డాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం ఆశించిన దిశలో ఫలితాలు రాబట్టడంలో కాప్–26 దారుణంగా విఫలమైంది. కర్బన ఉద్గారాల నికర శూన్యస్థితి (నెట్ జీరో) ఎప్పటికో... కానీ, ప్రతిష్టాత్మక భాగ స్వాముల సదస్సు (కాప్–26), ఫలితాలు రాబట్టడంలో మాత్రం ‘నికర శూన్యస్థితి’ని సాధించింది. ప్రపంచ ప్రజల ఆశల్ని నీరుగార్చింది. తెలుగునాట ప్రచారంలో ఉన్న ‘శుష్క ప్రియాలు–శూన్య హస్తాలు’ సామెత అతికినట్టు సరిపోయింది. గ్లాస్గో (స్కాంట్లాండ్)లో పన్నెండు రోజుల చర్చల సరళి, తుది ఫలితమే ఇందుకు నిదర్శనం! ప్రతి మనిషిని ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పు ప్రమాద నేపథ్యంలో... భూతాపోన్నతి కట్టడికి ప్రపంచ దృష్టి నాకర్షించిన కాప్–26 సదస్సు, అట్టహాసంగా మొదలై ఆశించిన ఫలి తాలు లేకుండానే ముగిసింది. ఐక్యరాజ్యసమితి (యూఎన్), అంతర్ ప్రభుత్వాల బృందం (ఐపీసీసీ) తాజా నివేదిక ప్రపంచాన్ని హెచ్చ రిస్తూ చేసిన ‘కోడ్ రెడ్’ ప్రకటనకు సరితూగే చిత్తశుద్ధి సర్వత్రా లోపిం చింది. సదస్సు చివరి రోజైన శుక్రవారం, యునైటెడ్ కింగ్డమ్ నేతృ త్వంలో ‘కీలక నిర్ణయాల’ (కవర్ డెసిషన్స్) పత్రం సిద్ధమౌతున్న సమయంలోనే.... సదస్సు ఏం సాధించిందని సమీక్షించినపుడు నిరాశే కళ్లకు కడుతోంది. ముసాయిదా ప్రతిలోనే ఆశాజనక ప్రతిపాదనలు లేవు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తీరని అసంతృప్తి మిగి లింది. ఏ కీలక విషయంలోనూ నిర్దిష్ట అంగీకారం, విస్పష్ట నిర్ణయం ఆవిష్కృతం కాలేదు. ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి పుడమి– జీవరాశిని కాపాడే ధీమా కలిగించకుండానే సదస్సు ముగిసింది. పాత విషయాలనే అటిటు తిప్పి... కొత్త మాటలు చేర్చి, వాగ్దానాలు దట్టించి చెప్పడం తప్ప ఆశాజనక స్థితి లేదు. ఇదొక తీవ్ర ఆశాభంగమని విశ్వ వ్యాప్తంగా పర్యావరణ కార్యకర్తలంటున్నారు. అగ్ర–సంపన్న దేశాలు పెద్ద హామీలు గుప్పించి నిర్దిష్ట కార్యాచరణకు కట్టుబడకుండానే బయటపడ్డాయి. ఆయా దేశాలు, వారి గోప్య ఎజెండాలు, వాటికి లోబడ్డ మార్కెట్ శక్తులు, లాబీయిస్టులు సదస్సులో ఆధిపత్యం చెలా యించారు. వారంతా చర్చల గమనాన్నీ, అంశాల ప్రాధాన్యతల్ని, నిర్ణ యాల సరళిని, గమ్యాన్నీ తాము కోరుకున్న దిశలో నడిపారు. ఏర్పాట్ల నుంచి ఎజెండా దాకా, చర్చల్లో భాగస్వామ్యం నుంచి కార్యాచరణ లోపించడంవరకు ఎన్నెన్నో అంశాలు ప్రశ్నార్థకమయ్యాయి. గ్లాస్గోలో, బయట... ఆది నుంచి కడదాకా నిరసన పర్వం సాగింది. బ్రిటన్ లేబర్ పార్టీ నేత జెర్మీ కోబిన్ అన్నట్టు, ఇది వర్గపోరుగా పరిణమిం చింది. వాతావరణ అత్యయికస్థితి కొందరు సృష్టించే వ్యవస్థల వల్ల పుట్టి, అత్యధికుల్ని వేధించే సమస్య అయిందన్న వ్యాఖ్య అక్షర సత్యం! ఇన్నేళ్లూ కర్బన ఉద్గారాలకు కారకులైన సంపన్న దేశాలు, ఇంకా కాలు ష్యాల వెల్లడికే మొగ్గుతున్నాయి. మరోవైపు అభివృద్ధి చెందుతున్న, చెందని పేద దేశాలను మాత్రం, ఉద్గారాల్ని కట్టడి చేయండని ఒత్తిడి తెస్తున్నాయి. హామీ ఇచ్చినట్టు సాంకేతికతను బదలాయించే, ఆర్థిక సహాయం చేసే ‘వాతావరణ ఆర్థిక వనరుల’ (క్లైమెట్ ఫైనాన్స్)పై కొత్తగా దేనికీ కట్టుబడకుండా ఉత్తి మాటలు చెప్పి జారుకున్నారు. కట్టడికి నిబద్ధత ఏది? భూతాపోన్నతిని 1,5 డిగ్రీల సెల్సియస్‌కు మించనీకుండా కట్టడికి ప్రధానంగా బొగ్గు, పెట్రోలియం వంటి శిలాజ ఇంధన వినియోగాన్ని నిలిపివేయాలి. తద్వారా కర్బన ఉద్గారాల్ని ఆపాలి. అప్పుడే భూతా పోన్నతి ఆగేది. ఇది నిర్దిష్ట కాలపరిమితితో వేగంగా జరగాలి. కానీ, సంపన్నదేశాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ముసాయిదా పత్రంలో ఆఖరి క్షణం వరకు ఉంచిన కీలక ప్రతిపాదనల్ని కూడా, ఉద్యమకారులు సందేహించినట్టే... శుక్రవారం రాత్రి (భారత కాల మానం ప్రకారం) పొద్దుపోయాక నిస్సిగ్గుగా తొలగించారు. ఇంధన– వాహన లాబీ బలానికిది నిదర్శనం. పునరుత్పాదక ఇంధనాల వైపు ఎంత వేగంగా, ఏయే కార్యాచరణతో మళ్లేది సంపన్న దేశాలు స్పష్ట పరచలేదు. ఉద్గారాల శూన్య (తటస్థ)స్థితిని ఎప్పటివరకు సాధి స్తాయో గడువు ప్రకటించి, అదే గొప్ప కర్తవ్యంగా చేతులు దులుపు కున్నాయి. అత్యధిక దేశాలు 2050, చైనా 2060, భారత్ 2070 గడువుగా వెల్లడించాయి. నిజానికిది కాప్ సాధించిందేమీ కాదు! భారత్ తప్ప మిగతా దేశాలన్నీ సదస్సుకు ముందే సదరు లక్ష్యాలు చెప్పాయి. పారిస్ (2015)లో ప్రకటించి, ఎవరికి వారు ‘జాతీయంగా కట్టుబడ్డ తమ భాగస్వామ్యా (ఎన్డీసీ)లను’ కొత్త లక్ష్యాలతో కొన్ని దేశాలు సవరించాయి. కానీ, నాటి ప్రకటన–ఆచరణకు మధ్య వ్యత్యా సాల్ని ఎత్తిచూపే ఏ సమీక్షా కాప్ వేదికలో జరుగలేదు. ‘పారిస్ రూల్ బుక్’ను ఎవరూ ముట్టుకోలేదు. కొత్త వాగ్దానాలెలా అమలుపరుస్తారో నిర్దిష్ట సమాచారం లేదు. బొగ్గు వినియోగం తగ్గించాలన్నారే తప్ప కొత్త ప్లాంట్ల ఏర్పాటు, అంతర్జాతీయ పెట్టుబడులు, విదేశీ ఆర్థిక సహా యాలు, దేశీయ సబ్సిడీలు.. వేటిపైనా నియంత్రణ విధించుకోలేదు. ఉత్తి హామీలే! అందుకే, ‘వాగ్దానాలు కాదు, మాకు కార్యాచరణ కావాలి’ అంటూ గ్లాస్గోలో లక్ష మందికి పైగా పర్యావరణ ఆందోళన కారులు పోగై నిరసన తెలిపారు. భారత్‌తో సహా పలు దేశాల ప్రక టనల్లో హామీకి, ఆచరణకు పొంతనే లేదు. పరస్పర విరుద్ధ పరిస్థి తులున్నాయి. మన దేశంలో బొగ్గు వెలికితీత, ఆ రంగంలో పెట్టు బడులు, ప్రయివేటు శక్తులకు గనులు, తవ్వకాలకు అడవుల్ని దారా దత్తం చేస్తున్న తీరు కాప్ వేదిక నుంచి చేసిన ప్రకటనకు పూర్తి భిన్నం. ఉద్గారాలకు విద్యుత్తు తర్వాత కారణమౌతున్నది రవాణా రంగం. వ్యక్తిగత–ప్రజా రవాణా వాహన వినియోగ విషయంలోనూ స్పష్టత లోపించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లే విషయంలో ఏ ఆచరణాత్మక అంగీకారమూ కుదరలేదు. చేసిన అంగీకార పత్రంపై జర్మనీ, జపాన్, దక్షిణకొరియా వంటి ప్రధాన వాహన ఉత్పత్తి దేశాలే సంతకాలు చేయలేదు. ‘పారిస్‌లో మాట్లాడుకున్నట్టు ఏ ఇంధన వనరుల్నీ పక్ష పాత ధోరణితో చూడొద్దం’టూ సాదీఅరేబియా చేసిన వాదన, వారి లాబీతత్వం తెలిపేదే! పలు విషయాల్లో... సదస్సు ప్రారంభపు విధాన వెల్లడికి, కడకు సంతకాలు చేసిన అంగీకార పత్రాలకి పొంతనే లేదు. పేద అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాపంగా... ఈ చర్చల సరళి అంతా... దోషులను దొడ్డదారిలో సాగనంపడం, బాధితులకే కొత్త బంధాలు వేయడం అన్న తరహాలో సాగింది. ఇప్పటి వరకు జరిగిన వాతావరణ అనర్థంలో ఏ మాత్రం పాత్ర–ప్రమేయం లేని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తాజా నియంత్రణలు ప్రతి బంధకమవుతున్నాయి. సాధారణ పద్ధతిలో అభివృద్ధి చెందడానికి శిలాజ ఇంధన వినియోగ కట్టడి, కర్బన ఉద్గారాల నియంత్రణ అడ్డంకి. ప్రత్యామ్నాయాల వైపు మళ్లడానికి అవసరమయ్యే సాంకేతి కత బదలాయింపు, ఆర్థిక సహాయానికి మాటిచ్చి, అభివృద్ధి చెందిన దేశాలు ఆచరించటం లేదు. ఈ ‘వాతావరణ ఆర్థిక వనరు’ విష యంలో కాప్–26 ఓ మార్గదర్శి అవుతుందనుకుంటే, పరిస్థితి ఏం మారలేదు. ఏటా పదివేల కోట్ల (వంద బిలియన్) డాలర్ల ఆర్థిక సహాయానికి 2009లో అంగీకరించిన అభివృద్ధి దేశాలు మాట తప్పాయి. కాప్లోనూ, ‘అవును.. నిజమే.. ఇవ్వాలి... ఇదేం పెద్ద విషయం కాదు... కట్టుబడే ఉన్నాం’ వంటి పొడిపొడి మాటలే తప్ప ప్రణాళిక, విడుదల క్రమాన్నీ వెల్లడించలేదు. అమెరికా అ«ధ్యక్షుడు జో బైడెన్ ఇలాగే స్పందించారు. సదరు ఆర్థిక వనరును నిర్వచించడానికి కూడా సంపన్న దేశాలు సిద్ధంగా లేవు. అది గ్రాంటా? ఎయిడా? పెట్టుబడా? రుణమా? ప్రయివేటు కంపెనీల మధ్య మారకమా? ఏ రూపంలో ఇస్తారనీ తెలుపటం లేదు. నిష్కారణంగా ఇప్పటికే నష్టపో యిన–వేగంగా భంగపోతున్న చిన్న, దీవి దేశాలను ఆదుకునే వారే లేరు. వారి ఆర్తి అరణ్య రోదనే! ప్రకృతి నుంచి తీసుకోవడమే తప్ప వెనక్కి ఇచ్చే సంస్కృతి రావటం లేదు. పైగా, ‘ప్రకృతి ఆధారిత పరిష్కారాలం’టూ కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఒకచోట ప్రకృతికి హాని చేసి, ఇంకో చోట ప్రకృతికి దోహదపడుతూ బాకీ తీరుస్తారట! ఇది మరో స్కామ్! చాలా విషయాల్లో స్పష్టత లేకపోగా కొత్త ఎత్తుగడలు, కార్పొరేట్, పరిశ్రమకు చెందిన లాబీలు పనిచేశాయి. ప్రపంచం ఆశించిన దిశలో ఫలితాలు రాబట్టడంలో కాప్–26 దారుణంగా విఫలమైంది. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ :dileepreddy@sakshi.com -
భాషాభివృద్ధికి పత్రికల కృషి కీలకం
సాక్షి, హైదరాబాద్: భాషాభివృద్ధికి పత్రికలు చేసే కృషి అనేక రూపాల్లో ఉంటుందని ‘సాక్షి’ దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి చెప్పారు. గడిచిన 200 ఏళ్ల చరిత్రలో పత్రికలు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశాయన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఆన్లైన్ వేదికగా ‘తెలుగు పత్రికలు–తెలుగు భాషా ప్రామాణికత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. పత్రికలు చేసే భాషాప్రయోగం వల్ల భాషకు నష్టం జరుగుతుందనే వాదన సరైంది కాదన్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాష ల్లోనూ పత్రికల వల్ల ఆయా భాషలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. డిజిటల్ మీడియా విస్తరిస్తున్న క్రమంలో భాషకు ఏకరూపత ఉండాలని, ప్రభుత్వం, అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ ఆ పని చేయాలన్నారు. తానా పూర్వ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, ఎం.నాగేశ్వర్రావు, సతీష్‌చందర్, శ్రీరామ్మూర్తి, తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, సమన్వయకర్త శ్రీనివాస్ పాల్గొన్నారు. చదవండి: తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ అధ్వర్యంలో ఉగాది వేడుకలు -
పట్టపగ్గాల్లేని ‘బరి’తెగింపు
‘అవినీతికి మూల్యం చెల్లించేది పేదలే’ అంటారు పోప్ (ఫ్రాన్సిస్). నిజమే! మన వ్యవస్థలో వేర్లు విస్తరించి, ఊడలు బలిసిపో యిన అవినీతికి అంతిమ బాధితులు నిరుపే దలు, నిస్సహాయులు. ప్రత్యక్షంగా పనులు జరుగక, ఫలాలు అందక ఒకసారి, వ్యవస్థ లన్నీ నిర్వీర్యమై అవకాశాలేవీ దక్కక అట్ట డుక్కు నెట్టేయబడి మరోసారి... వంచితుల య్యేది వారే! సంపద ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్న వాళ్లు అడ్డదారుల్లో అవినీతిని పెంచి పోషించడానికి వెచ్చించే మొత్తాల్ని తమ వ్యయంలోనో, పెట్టుబడిలోనో భాగంగానే లెక్కేసుకుంటున్నారు. పెట్రేగుతున్న అవినీతితో పాలనా వ్యవస్థలతో పాటూ, అంతిమంగా ప్రజాస్వామ్యమే విశ్వసనీయత కోల్పోతోంది. రాజకీయ వ్యవస్థ కనుసన్నల్లోనో, అంటకాగుతూనో జరిగే అధికారిక అవినీతి తారస్థాయికి చేరింది. మన తెలుగునాట అధికారుల అవినీతి బాగోతాలు బట్టబయలవుతున్న తీరు, వారి వద్ద జమవుతున్న నికృష్ట సంపద గగుర్పాటు కలిగిస్తోంది. మొన్నొక ఈఎస్సై అధికారిని, మరో ఎమ్మార్వో, నిన్న ఓ అడిషనల్ కలెక్టర్, నేడు ఏసీపీ! ఇలా ఎందరెం దరో... ఇది దొరికిన దొంగల సంగతి! అదేదో ఇంగ్లీషులో సామెత చెప్పినట్టు దొరకనిది కొండంత, దొరికేది పిసరంత. చట్టాల్లో లోపాలు, అపరిమిత నియంత్రణ, సంక్లిష్టమైన పన్నులు–లైసెన్సు విధానం, లోపించే పారదర్శకత, అధికారుల విచ్ఛలవిడి నిర్ణయాధికారం... అన్నీ వెరసి అవినీతికి ఆస్కారం పెంచుతున్నాయి. భూముల విలు వలు అసాధారణంగా పెరిగి, దాన్నొక వినిమయ వస్తువు చేసిన వైనం అవినీతిని అమాంతం పెంచేసింది. తేరగా గడించే నల్లధనం– భూమిపై పెట్టుబడి–భూలావాదేవీ లాభాల్ని నల్లధనంగా మార్చడం.. ఇదొక విషవలయం. ఇవన్నీ ఒక ఎల్తైతే మన ఆలోచనా ధోరణి అవి నీతికి ఆజ్యం పోస్తోంది. అవినీతిని సమకాలీన సమాజమే పెంచి పోషిస్తున్నట్టుంది. ఎలా సంపాదించినా సరే, సంపద కలిగినోడికున్న గౌరవం, మర్యాద నిజాయితీ పరులైన పేదలకు, సామాన్యులకు సమాజంలో దక్కడం లేదు. నిజాయితీ అధికారులకు అసలు గుర్తింపే లేకపోవడం వ్యవస్థలోని పెద్ద లోపం. కొత్త తరాన్ని సమాజం పెంచు తున్న తీరు కూడా లోపభూయిష్టమే. అవినీతికి పాల్పడి దొరికితే పరువుపోతుందనో, శిక్ష పడుతుందనో అధికారుల్లో భయమేలేని నిర్బీతి నేటి విచ్చలవిడి అవి నీతికి ప్రధాన కారణం. మన నేర దర్యాప్తు–న్యాయ విచారణ వ్యవస్థ అవినీతి పరుల్ని ఏ మాత్రం భయ పెట్టలేని స్థితికి రావడం ఆందోళనకరం. ఇంత బరితెగింపా? పట్టుబడినా ఏమీ కాదన్న ధీమాయే అధికారుల విచ్ఛలవిడి తనానికి కారణం. అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) నమోదు చేస్తున్న వేర్వేరు కేసుల్లో కొనదాకా నిలిచేవి చాలా తక్కువ. లంచం తీసుకుంటూ పట్టు బడ్డ (ట్రాప్) కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, ఇతర అవినీతి కేసుల్లో విచారణలు సజావుగా సాగి, అభియోగాలు నిర్ధారణ అయి, శిక్షలు పడ్డ కేసుల కన్నా నిందితులైన అధికారులు నిక్షేపంగా బయటపడ్డ కేసులే ఎక్కువ. కొలిక్కి వచ్చే కొన్ని సందర్భాలూ చిన్న మొత్తాల అవినీతి కేసులే తప్ప బడాబాబులవి కావు! పైరవీలకు ‘సచి వాలయం’తో సంపర్కం లేనివాళ్లు, దళారుల్ని పట్టుకునే ‘వ్యవహార దక్షత’ లేనివాళ్ల కేసులే కడదాకా నిలుస్తాయి. సాక్ష్యాలు దొరకకో– నిలువకో, సాక్షులు మాట మార్చో, తదుపరి దర్యాప్తుల్ని సాగనీయకో, చర్యల్ని నిలిపివేయించుకునో.. కారణాలేమైతేనేం వారు శిక్షలు తప్పిం చుకుంటున్నారు. చూస్తుండగానే తిరిగి పోస్టింగ్ తెప్పించుకుంటు న్నారు. సస్పెన్షన్ కాలపు జీతాల్ని కూడా తిరిగి పొందుతున్నారు. అవేవీ రాకపోయినా సరే! లేకపోతే, ఏ దైర్యంతో... ఒక అధికారి 40 లక్షల నగదు తీసుకొని, లంచం కింద భూమి రిజిష్టరు చేయించు కుంటాడు? న్యాయమూర్తి అయ్యుండీ కోట్ల రూపాయల లంచం డబ్బును ఏకంగా బ్యాంకులో ఎలా జమచేసుకుంటారు? ప్రభుత్వ అధికారిగా, మరో ఆదాయవనరు లేకుండా రూ.7 కోట్లతో నగలెలా కొంటారు? రెండు కోట్ల లంచం, కోటి పదిలక్షల రూపాయల నగ దుతో పట్టుబడ్డ అధికారి నిర్వాకాన్ని, అవినీతిలో ప్రపంచ రికార్డుల కెక్కించమని గిన్నిస్ సంస్థకు వినతిపత్రం వెళ్లిందంటే, మన కీర్తి ఏ స్థాయిలో ఉందో ఊహించొచ్చు. ఏపీలో ఒక నకిలీ ‘ఏసీబీ అధికారి’ పోలీసులకు దొరికాడు. అతన్ని పట్టుకొని కూపీ లాగితే, 18 మంది పెద్ద అధికారుల వద్ద ‘కేసు చేస్తా’మని భయపెట్టిన ముఠా డబ్బు గుంజినట్టు తేలింది. అంటే, ఎంత విచ్ఛలవిడిగా అవినీతికి పాల్పడి అక్రమార్జన చేస్తే, దారిన పోయే దొంగ ఏసీబీ అధికారులకూ చేయి తడుపుతారు? ఆ 18 మందిపై తర్వాత అసలు ఏసీబీ కేసులు నమోదు చేసింది, అది వేరొక పరిణామం! చట్టమంటే భయం లేదు. నేర దర్యాప్తంటే లెక్కలేదు. అక్రమార్గంలో వచ్చిన సంపాదనలో కొంత వెచ్చిస్తే ఉపశమన మార్గాలవే దొరుకుతాయ్, ఇదీ వరస! ‘భూ’మాయ ! పట్టణాలు, నగరాల శివారుల్లో భూముల విలువలు అమాంతం పెరిగిపోవడంతో అవినీతికి రెక్కలొచ్చాయి. భూలావాదేవీలతో ప్రత్య క్షంగా, పరోక్షంగా సంబంధమున్న అధికారుల్లో కొందరి నిర్వాకాలకు పట్టపగ్గాల్లేవు. డబ్బిస్తే ఏమైనా చేయగలరు. దీనికి ఆడా మగ తేడాయే లేదు. తన భూమిని ఇతరులకు పట్టా రాయించారనే కోపంతో ఒక కక్షిదారు ఏకంగా ఓ మహిళా ఎమ్మార్వోను ఆఫీసులోనే నిప్పంటించి కాల్చే శాడు, అదే మంటల్లో తానూ చచ్చాడు. ఇంకో ఎమ్మార్వో వద్ద ఏసీబీ అధికారులు రూ.30 లక్షలు స్వాధీనపరచుకోవడంతో భర్త అవ మాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే భూవివాదంలో ఆర్ఐ కూడా నగదుతో పట్టుబడ్డాడు. గతేడాది శివారు ఎమ్మార్వో వద్ద రూ. 93 లక్షల నగదు దొరికింది. ఇప్పుడు ఏసీబీకి దొరికిన పోలీస్ అధికారి (ఏసీపీ) పెద్దఎత్తున సివిల్ దందాల్లో తలదూర్చి, భూలావాదేవీలు జరిపి అక్రమార్జన చేశారని అభియోగం. రూ.కోటి నగదుతో పట్టుబడ్డ ఎమ్మార్వో, కోటిన్నర రూపాయల అవినీతి డీల్ చేసుకున్న జిల్లా అధి కారి... వీరందరివీ భూదందాలే! భూమి ధరలు అసాధారణంగా పెర గడంతో అక్రమార్జన పెట్టుబడి తరలివస్తోంది. నిర్ణయాధికారం ఉన్న అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. ‘ఆ సర్వే నంబర్లో అప్పనంగా మీకంత ప్రయోజనం కలుగుతున్నపుడు, అందులో మాకొక 5 లక్షల రూపాయలిస్తే మీకేంటి నష్టం?’ అని ఓ ఎమ్మార్వో బహిరంగంగా అన్నారంటే, పరిస్థితికి ఇది అద్దం పట్టేదే! ఎక్కడో సంపాదించిన పెద్ద మొత్తాలు, నల్లధనం భూముల కొనుగోళ్లకు పెట్టుబడు లవు తున్నాయి. స్వల్పకాలంలో అసాధారణంగా ధరలకు రెక్కలొచ్చిన భూక్రయవిక్రయ లాభాలు మరెక్కడో నల్లధనంగా పోగవుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత, రెండు లక్షల రూపాయలకు మించి నగదు వ్యవహారాలు జరుపొద్దన్న ప్రభుత్వ నిబంధనలు గాలికిపోయాయి. సందట్లో సడే మియ్యాల్లా ఈ వ్యవహారాల్లో తమ అవసరాల్ని, అవకా శాల్ని అవినీతి అధికారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే, అవినీతిలో రెవెన్యూ శాఖది అగ్రతాంబూలం. ఇదే వరుసలో ఎకై్జజ్, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్టీయే, వాణిజ్యపన్నులు వంటి శాఖలు న్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కస్టమ్స్, రైల్వే, వస్తు–సేవా పన్నులు తదితర శాఖల్లో అవినీతి పెద్ద మొత్తాల్లోనే! విలువల పతనం అరిష్టాల మూలం అధికారిక అవినీతికి మూలాలు రాజకీయాల్లో ఉంటాయన్నది కౌటి ల్యుని రాజనీతి శాస్త్రం నుంచి నేటి వరకు ఎడతెగని సత్యం. రాజకీయ నాయకుల బెదిరింపులో, లొంగదీసుకోవడాలో, కూడబలుక్కోవ డమో... నమూనా ఏదైతేనేం అత్యధిక సందర్బాల్లో అధికారుల అవి నీతికి రాజకీయాలే ప్రేరణ! అధికారుల అవినీతి విడిగా చూడదగ్గ, రాజకీయాలకు పూర్తిగా సంబంధంలేని వ్యవహారమైతే కాదు. కీలక స్థానాల్లోకి అధికారుల బదిలీలు జరిపించడం, నిలువరించడం కొందరు నాయకులకొక ఫక్తు వ్యాపకం. చట్టాల్ని ఉల్లంఘించే వక్ర మార్గాలకు వారిపై వత్తిడి పెంచి చేయించుకునే నాయకులు, ప్రజా ప్రతినిధులు అన్ని స్థాయిల్లోనూ ఉన్నారు. మరికొన్ని సార్లు సఖ్యత కుదిరి, దోపిడీ సొత్తు తగుపాళ్లలో పంచుకునే అధికార–రాజకీయ జోడిగుర్రాల అవినీతి పరుగుకూ పట్టపగ్గాల్లేవు. నాయకులు ఒత్తిడి తెచ్చి ఒకటి, అర తప్పుడు పనులు చేయించుకుంటే, అదే బాటలో చడీచప్పుడు లేకుండా తాము నాలుగయిదు చేసుకునే అధికారులకూ కొదువ లేదు. వినని వారిని వేధిస్తుంటారు. అక్రమార్జన వక్రమార్గంలో తమ దారికి రాకుంటే, సదరు అధికారుల్ని తప్పుడు కేసుల్లో నేతలు ఇరికించే సందర్భాలూ ఉన్నాయి. దీన్ని పరిహరించేందుకే, విజిలెన్స్ కేసుల్లో దర్యాప్తు అనుమతి అధికారం ప్రభుత్వం చేతిలో ఉండేట్టు ప్రతి పాదించినా, సుప్రీంకోర్టు అందుకు సమ్మతించలేదు. రాజ్యాంగపు సమానత్వ హక్కుకి భంగమని అనుమతి నిరాకరించింది. అలా ఏక పక్ష నిర్ణయాధికారం సర్కారు చేతిలో ఉండటం కూడా ప్రమాద కరమే! ఏకకాలంలో అనేక చర్యలే మార్గం అధికారిక అక్రమార్జన సంస్కృతిని రూపుమాపాలి. చట్టాలను పటిష్ట పరచడంతో పాటు పాలనలో పూర్తి పారదర్శకత తేవాలి. పలు పాలనా వ్యవహారాల్ని ‘ఆన్లైన్’ చేసిన తర్వాత అవినీతి తగ్గినట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధారాలున్నాయి. దీనిపై అధ్యయనం చేసిన ఢిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ (సీఎమ్మెస్), అవునని నిర్దారించింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిషన్ ఇదే ప్రతిపాదించింది. విప్లవాత్మక సమాచార హక్కు చట్టం దీన్ని ధృవపరిచింది. అధికారుల విచక్షణాధికారాలకు కత్తెర పడాలి. అవినీతి బాహాటంగా ఉండి, తమకు అన్యాయం జరిగినపుడు... పౌరులు గొంతెత్తి పోరాడ్డానికి పలు ప్రజాస్వామ్య వేదికలుండాలి. మానవహక్కుల సంఘం, విజిలెన్స్ కమిషన్, లోకాయుక్త, ఆర్టీఐ వంటి వ్యవస్థలు, సంస్థలన్నింటినీ పాలకులు నిర్వీర్యం చేయడమో, నీరుగార్చడమో చేస్తున్నారు. జన్‌లోక్‌పాల్‌కు మోక్షమివ్వరు. ఈ దుస్థితే పౌరుల పాలిట శాపమౌతోంది. మనుగడ కోసం మధ్యాహ్న భోజనమే ఆసరాగా బడికొచ్చే ఓ విద్యార్థికి, టీసీ ఇవ్వడానికి రెండు వేల రూపాయలు లంచమడిగితే ఇవ్వలేక బడి మానాల్సి వచ్చింది. ఆ అధికారిని ఏం చేయాలి? అవినీతి ఒక క్యాన్సర్. ఏం చేసైనా దాన్ని అంతం చేయాలి, లేకుంటే అది ప్రజాస్వామ్యాన్నే అంతం చేస్తుంది. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
‘సాక్షి’ జర్నలిజం తుది ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : ఏడాది పీజీ డిప్లమా కోర్స్ (2019–20) కోసం సాక్షి జర్నలిజం స్కూల్ నిర్వహించిన ప్రవేశ పరీక్ష, బృందచర్చ , మౌఖిక పరీక్షల అనంతరం తుది ఫలితాలను సోమవారం విడుదల చేశారు. హాల్ టెకెట్ నంబరు ఆధారంగా అక్కడే అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంపికైనవారు ఆగస్టు 1న (గురువారం) సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో ఉదయం 9.30 గంటలకు జరిగే కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని స్కూల్ ప్రిన్సిపల్ ఆర్. దిలీప్‌రెడ్డి తెలిపారు.(కాల్ లెటర్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి) ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లు 110020 130114 130273 130394 170057 210021 250012 280004 110030 130120 130277 150013 170091 220005 250015 280019 110040 130121 130278 150033 190005 230010 250022 290003 110042 130145 130342 150048 190007 230011 250030 290026 120014 130191 130359 150049 200014 240011 250031 290030 120023 130211 130364 150071 200037 240012 250032 300002 120048 130242 130368 150073 200067 240023 250042 310000 130016 130245 130378 150078 200071 240029 260006 310031 130060 130246 130384 160002 210010 250000 260007 310068 130093 130262 130387 170051 210020 250007 270000 -
జనచిత్తం దోస్తున్న కొత్తగాలి
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడో కొత్తగాలి వీస్తోంది. పలువురి భయ–సందేహాలను తుడిపేస్తూ, సరికొత్త ఆశల్ని చిగురింప చేస్తూ పిల్ల తెమ్మెరలా మొదలైన ఆ గాలి రోజురోజుకూ బలపడుతోంది. మార్పులకు వాకిళ్లు తెరుస్తోంది. రాజకీయంగానే కాక ఆ గాలి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకూ సంకేతాలిస్తోంది. దాన్ని గుర్తించడం, అంగీకరించడం, ఆహ్వానించడం ఇప్పుడు ప్రధానం! ఎన్నికల ముందు తానిచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలుపరుస్తున్న తీరు, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలి... ఈ కొత్తగాలికి కారణం. అక్రమ నిర్మాణాల్లో తలదాచుకునగోరే ‘దశాబ్దాల అనుభవం’ కన్నా, నేలతో, అడవితో, అట్టడుగు మట్టి మనుషులతో మమేకమైన ‘నెల యోధుడి’ చొరవనే సరైన పాలనకు సంకేతమని జనన్నినాదం! రాజకీయాల్లో మార్పు రావాలన్నది చాలా కాలంగా ప్రజల ఆశ. అనేకుల ఆకాంక్ష. కవుల కల్పన. కళా ప్రక్రియల్లో వస్తువు. ప్రసంగాల్లో ఆదర్శం. కానీ, ఆచరణలో లోపం! ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడో కొత్తగాలి వీస్తోంది. పలువురి భయ–సందేహాలను తుడిపేస్తూ, సరికొత్త ఆశల్ని చిగురింప చేస్తూ పిల్ల తెమ్మెరలా మొదలైన ఆ గాలి రోజు రోజుకూ బల పడుతోంది. మార్పులకు వాకిళ్లు తెరుస్తోంది. రాజకీయంగానే కాక ఆ గాలి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకూ సంకేతాలిస్తోంది. దాన్ని గుర్తించడం, గుర్తించడం కన్నా ముఖ్యంగా అంగీకరించడం, అంతకన్నా ప్రధానంగా ఆహ్వానించడం ముఖ్యం! ప్రముఖ కవి, రచ యిత, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న మాటల్లో చెప్పాలంటే.... ‘‘పార్టీ పిరాయింపులు మంచిది కాదని నేనీ సినిమాలో పాట రాసిన, కవులు పాటలు రాస్తరు, ఊహ చేస్తరు, ప్రజాస్వామ్యవాదులు, దార్శనికులు, దర్శకులు ఉన్నతమైన ఊహ చేస్తరు... కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా ఆచరించి చూపాడు, అది ముఖ్యం..’’ అన్నారు. ఇంకో పార్టీ తరపున ఎన్నికై తమ పార్టీలోకి వస్తా మంటే వారిని తాము చేర్చుకోమని, ఫిరాయింపుల్ని ప్రోత్సహించబో మని, పదవులకు రాజీనామా చేయాల్సిందే... అన్నారంటూ ఆ సంద ర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా గురించి మాట్లాడుతూ వెంకన్న ఈ వ్యాఖ్య చేశారు. దేశంలో పార్టీ ఫిరాయింపులొక ప్రహసనంగా మారి మార్కెట్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నపుడు, చట్టసభ వేదిక నుంచి ఏపీ ముఖ్యమంత్రి ఓ చరిత్రాత్మక ప్రకటన చేశారు. ‘...ఏమరుపాటుగా ఎవరైనా అలా పార్టీ మారి సభ కొచ్చినా... మీ అధికారాన్ని వినియోగించి ఆ సభ్యుల్ని అనర్హులుగా ప్రక టించండి’ అని స్పీకర్‌ను స్వయంగా కోరారు. పార్టీలకతీతంగా, విలు వలతో నడవాల్సిన స్పీకర్ స్థానపు ఔన్నత్యాన్ని అలా గుర్తు చేశారు. స్పీకర్ ఎన్నిక సందర్భంలో మాట్లాడుతూ ఈ సాహసోపేతమైన విలు వను సీఎం ప్రకటించారు. కానీ, ఈ చొరవకు జాతీయ మీడియాతో సహా ప్రసార మాధ్యమాలు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. పేరున్న ఇంగ్లీష్ పత్రికలు కూడా సాదాసీదాగానే రాశాయి. పార్టీ ఫిరాయింపులతో రాజ కీయ విలువలు దిగజారుతున్న ఈ తరుణాన వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చూపిన చొరవ విస్తృతస్థాయిలో చర్చ జరగాల్సింది. ఒకటి, రెండు కాదు... గత నెలాఖరున ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన నుంచి ఒకటొ కటిగా జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకట నలు, వెల్లడిస్తున్న అభిప్రాయాలు తెలుగువాళ్లను ఎంతగానో ఆకట్టుకుం టున్నాయి. ఒక రకమైన సంతృప్తి వెల్లువ ఇపుడు రాష్ట్రమంతా అలుము కొని ఉంది. సామాన్య ప్రజానీకం నుంచి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, ఆలోచనాపరుల వరకు అందరూ తాజా పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. గతంతో పోల్చి చూసుకొని, ఏదో తెలియని ‘హాయి’ని పొందుతున్నారు. గిట్టని వాళ్లు, వారి అను‘కుల మీడియా’ పుణ్యమా అని లోగడ ఎంత దుష్ప్రచారం జరిగింది? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రత్యర్థి రాజకీయ వర్గాల్లోని వారికీ, తాజా స్థితి కొంత ఆశ్చర్యంగానే ఉంది. ఎన్నికలకు ముందు ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు, కల్పించిన భరోసా, ప్రకటించిన హామీలు క్రమ క్రమంగా ఆచరణలోకి వస్తున్న తీరు అధికుల్ని విస్మయ పరుస్తోంది. ఏ హంగూ, ఆర్భాటం, నాటకీయత లేకుండా... ఇంత సహజంగా కార్యా చరణ సాధ్యమా? అన్నది వారి ముందొక పెద్ద ప్రశ్న. ఇది విలువల రాజకీయాల్ని పరిచయం చేస్తున్న కొత్తగాలి అనేది వారి భావన. తొలి సంతకం నుంచి ‘అమ్మ ఒడి’ ఇంటర్ విద్యార్థులకు వర్తింపజేస్తామన్న గురువారం నాటి ప్రకటన వరకు... జనహితంలో ఎన్నెన్ని నిర్ణయాలో! బడుగు బలహీన వర్గాలకు సమున్నత స్థానం కల్పిస్తూ మంత్రివర్గాన్ని కూర్చిన తీరు సంచలనమే అయింది. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన దానికన్నా పిసరంత ఎక్కువే తప్ప లోపం లేదు. డొల్లతనం లేదు, నాన్చుడు లేదు, డొంక తిరుగుడు అంతకన్నా లేదు. ‘ఆశా’కార్యకర్తల జీతాలు వృద్ధి, హోంగార్డులు, పారిశుధ్య పనివారల వేతనాల పెంపు, ఉద్యోగుల సీపీఎస్ రద్దు–ఐ.ఆర్ ప్రకటన, రైతు పెట్టుబడి సహాయాన్ని ముందుకు జరపడం, పోలీసుల వారంతపు సెలవు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం... ఇలా చెప్పుకుంటూ వెళితే జాబితా పెద్దదే! ఇదొక ఆత్మీయ ప్రభుత్వంలా ఉంది. ఓదార్పు, ప్రజాసంకల్ప పాదయాత్ర, దీక్షలు... ఏదయితేనేం, పార్టీ స్థాపించక ముందు నుంచి నేటికీ, నిరంతరం ఆయన ప్రజల్లో ఉండటం వల్లనేమో ‘కొత్త సీఎం’ అన్న భావనే ప్రజలకు కలగటం లేదు. సీఎంని, ఆయన ప్రభుత్వాన్ని తమ నిజమైన ప్రతినిధిగా పౌరులు భావిస్తున్నారు. కొత్త శాసనసభ తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు చెబుతూ, ‘ఎన్నికల వరకే రాజకీయాలు... గెలిచాక తరతమ భేదాల్లేవు, మనం ప్రజలందరికీ ప్రతినిధులం, జవాబు దారులం’ అన్న సీఎం మాటలు విశ్లేషకులకు తరచూ గుర్తొస్తున్నాయి. కుటుంబపెద్దను చూస్తున్న యంత్రాంగం స్వల్ప కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు తమ రాజకీయ పెద్ద దాదాపు అర్థమైపోయాడు. నస లేదు, సోది ప్రసంగాలకు తావే లేదు. ఏదైనా... లోతైన పరిశీలన, అధ్యయనంతోనే మాట్లాడటం. అదీ, ఆత్మీ యంగా! మర్యాదకు ఎక్కడా లోటు లేదు. ముక్కుసూటిగా, ముక్తసరిగా తన మనోభావాల్ని వ్యక్తం చేయడం. ఏది వద్దో చెప్పడం, ఏది కావాలో విస్పష్టంగా అడగటం, ఇది వారికీ బాగుంది. సాంకేతికాంశాలపైన కూడా సాధికారతతో సీఎం జరిపిన పోలవరం రివ్యూని పలువురు ఇంజనీరింగ్ సీనియర్లు మననం చేసుకుంటున్నారు. ఇదివరకటి చేదు అనుభవాల దృష్ట్యా, ఇప్పుడు ముఖ్యమంత్రి సమీక్షల్లో పాల్గొంటున్న ఉన్నతాధికారులు భిన్నమైన వాతావరణం చూస్తున్నారు. గంటల తర బడి వేధింపుల పర్వం లేదు. లోపలొకటి బయటొకటిగా కాకుండా ఉన్న దున్నట్టుగా మాట్లాడుతూ, తమకు ఇరకాట పరిస్థితి కల్పించని నాయ కత్వం అనే భావన వారిలో వ్యక్తమౌతోంది. ‘పాలకులం కాదు, ప్రజా సేవకులం...’ అన్న ముఖ్యమంత్రి సందేశం అధికారులకు బోధపడింది. ‘మాకు ఓటు వేయని వారికి కూడా మన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందాలి. వారు అర్హులైతే చాలు! అదే ప్రాతిపధిక .... కాల క్రమంలో వారే ఆత్మవిమర్శ చేసుకొని, తమ వైఖరి మార్చుకోవాలి’ అంటూ కలెక్టర్ల సమావేశంలో వెలిబుచ్చిన అభిప్రాయంలోనే సీఎం కార్యాచరణ ఎంతటి విశాల దృక్పథంతో చేపట్టిందో అధికార గణానికి అర్థమైంది. ‘చిన్న వయసులో ఇంతటి పరిపక్వత ఊహించలేద’న్న సీని యర్ అధికారి అభిప్రాయం వాస్తవిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఒక భేటీతోనే రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాబోయే రోజు లెలా ఉంటాయో అర్థమైపోయింది. పనిపై శ్రద్ద పెట్టి ఫలితాల ద్వారా తమ సత్తా చూపించుకోవడానికి ఈ పరిస్థితినొక అవకాశంగా వారు పరిగణిస్తున్నారు. తండ్రి పంథా తనయునికో వరం జన హృదయాలు గెలిచిన నాయకుడిగా దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డికున్న మంచి పేరే కాక, ఆలోచనలూ ఆయన తనయుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ప్రభావితం చేస్తున్నాయి. విశాల జనహితం కోరే వైఎస్ పంథా నేటికీ పరిపాలనకు దారులు పరు స్తోంది. వైఎస్సార్ తన పాతికేళ్లకు పైబడ్డ రాజకీయ ప్రస్తానంలో చూసిన, చేసిన పలు ఆర్థిక, రాజకీయ, సామాజికాంశాల్లోని ప్రయోగాలు ఇప్పు డీయన మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. ఆయా ప్రయోగాల తర్వాత, సందేహాలకతీతంగా దృవపడ్డ విధానాలను ప్రస్తుత సీఎం నేరుగానే చేప డుతున్నారు. అవసరాన్ని బట్టి, అదనపు అంశాల్నీ చేర్చి మరింత మెరు గుపరుస్తున్నారు. అమ్మ ఒడి, తొమ్మిది గంటలు పగటిపూటే ఉచిత విద్యుత్తు యత్నం వంటివి ఆ కోవలోవే! అనేక విషయాల్లో పెద్దాయన ఆలోచనలూ తనయుడ్ని ప్రభావితం చేస్తున్నాయి. విధానాల్లో, నిర్ణ యాల్లో, సాధనలో... అవి ప్రతిబింబిస్తున్నాయి. మచ్చుకు, నిన్నటి ఎన్ని కల్లో వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లు సాధించడమే ఓ నిదర్శనం! 1999 ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పదిరోజుల్లోనే, ఒక రాత్రి భోజన భేటీలో మేం ముగ్గురు జర్నలిస్టులం డా‘‘ వైఎస్సార్‌తో ఉన్నాం. సీనియర్ నాయకుడు మణి శంకర్ అయ్యర్ తనతో అన్న మాటల్ని వైఎస్సార్ గుర్తు చేసుకున్నారు. ‘ప్రచార సమయంలోనే మీరు గెలిచినంత పని చేశారు. ఆ ఊపు చూసి బెంబేలెత్తిపోయిన సీఎం చంద్ర బాబు అతిజాగ్రత్తకు వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, వాజ్‌పేయ్‌పై ఉన్న సానుభూతి, కార్గిల్ యుద్ద ప్రభావం వల్ల వారి ఉమ్మడి ఓటింగ్ శాతం పెరిగింది. మీ ఓటింగ్ శాతం తగ్గి ఓటమి తప్పలేదు’ అని అయ్యర్ విశ్లేషించినట్టు చెప్పారు. ‘..ఎదుటి వారి పొత్తులు, జిత్తులెలా ఉన్నా... 50 శాతానికి పైబడి ఓట్లు సాధించడం లక్ష్యంగా పనిచేస్తేనే విజయం ఖాయమవుతుంది’ అని వైఎస్ తన సంకల్పం చెప్పారు. అది తనయుడు జగన్మోహన్రెడ్డి ఈ ఎన్నికల్లో నిరూపించారు. కూల్చివేత ఓ సంకేతం అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. ఆచరణను ప్రజలు గమనిస్తున్నారు. ఇదే సమ యంలో, కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణం ‘ప్రజావేధిక’ కూల్చివే తకు ప్రభుత్వం తలపెట్టడాన్ని కొందరు మేధావులు చర్చకు తెస్తున్నారు. ‘ఇవేం వందల ఏళ్లనాటివి కావు, కోట్ల రూపాయల వ్యయంతో ఇటీవలే కట్టిన భవనాలు, అయినా కూలుస్తారా?’ అంటున్న మేధావులకొక ప్రశ్న. కృష్ణా నది కరకట్టపై నిర్మాణాలన్నీ త్వరలోనే కూల్చేస్తాం....’ అని స్థానిక అధికార టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి నాటి మంత్రి పలికినా మాట్లా డని మీ మౌనం దేనికి సంకేతం? కొద్ది ఖర్చుతో కట్టుకునే పేదల ఇళ్ల యితే కూల్చొచ్చు! పెద్ద ఖర్చుతో ప్రభుత్వం కట్టే అక్రమనిర్మాణాలు కూల్చొద్దా? ‘ఇకపై బాక్సైట్ తవ్వకాలుండవని ప్రకటిస్తూనే, గంజాయి సాగువద్దు అడవి బిడ్డలారా, మీకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు చూపుతామం’టున్న ప్రస్తుత ముఖ్యమంత్రి విచక్షణ ఓ కొత్త గాలి. అక్రమ నిర్మాణాల్లో తలదాచుకునే ‘దశాబ్దాల అనుభవం’ కన్నా, నేలతో, అడవితో, అట్టడుగు మట్టి మనుషులతో మమేకమైన ‘నెల యోధుడే’ సరైన పాలకుడన్నది జనన్నినాదం! -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు టీడీఎఫ్ ఏర్పాట్లు
హైదరాబాద్: వచ్చే జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించడానికి అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టెక్సాస్ రాష్ట్రంలోని సాన్ ఆంటానియో టీడీఎఫ్ విభాగం గురువారం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్. దిలీప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాన్ ఆంటానియో టీడీఎఫ్ విభాగానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి బిల్లా, పాండు కదిరే, తదితరులు పాల్గొని తెలంగాణ ఆవిర్భావ నేపథ్యంపై దిలీప్ రెడ్డి గారితో ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం టీడీఎఫ్ ప్రతినిధులు దిలీప్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.