ముగిసిన అంత్య పుష్కరాలు | The terminal end of the ample | Sakshi

ముగిసిన అంత్య పుష్కరాలు

Aug 12 2016 12:29 AM | Updated on Sep 4 2017 8:52 AM

ముగిసిన అంత్య పుష్కరాలు

ముగిసిన అంత్య పుష్కరాలు

మంగపేట మండల కేంద్రంలోని పుష్కరఘాట్‌ వద్ద గత నెల 31న ప్రారంభమైన గోదావరి అంత్య పుష్కరాలు గురువారం ముగిశాయి. చివరిరోజు వరంగల్, మహబూబాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, జనగామ ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, డీసీఎం వాహనాల్లో వందలాదిగా తరలివచ్చి పుష్కర ఘాట్‌ వద్ద స్నానాలు ఆచరించారు.

  • చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు
  • గోదావరికి ప్రత్యేక పూజలు
  • మంగపేట : మండల కేంద్రంలోని పుష్కరఘాట్‌ వద్ద గత నెల 31న ప్రారంభమైన గోదావరి అంత్య పుష్కరాలు గురువారం ముగిశాయి. చివరిరోజు వరంగల్, మహబూబాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, జనగామ ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, డీసీఎం వాహనాల్లో వందలాదిగా తరలివచ్చి పుష్కర ఘాట్‌ వద్ద స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా మహిళలు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలు, పసుపు కుం కుమ, గాజులను నదిలో వదిలారు. అలాగే కొందరు భక్తులు త మ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. కాగా, తహసీల్దా ర్‌ తిప్పర్తి శ్రీనివాస్, ఎస్సై ననిగంటి శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్, రెవెన్యూ సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. 
     
    గోదావరికి ప్రదోశకాల హారతి
    అంత్య పుష్కరాల ముగింపును పురస్కరించుకుని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ అధ్యక్షుడు కొయ్యడ నర్సింహామూర్తి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గోదావరి మాతకు బ్రాహ్మణులు ప్రదోశకాల హారతి ఇచ్చారు. ఈ సం దర్భంగా స్థానిక శివాలయంలోని ఉమాచంద్రశేఖరస్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోని మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ ఉత్సవ విగ్రహాలకు గోదావరి లో పుష్కరస్నానం జరిపించారు. అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ముల్తైదువలతో వస్త్రాలు, గాజులు, పూలు, పసుపు, కుంకుమలను నదిలో వదిలారు. కాగా, వరంగల్‌ మొదటి అదనపు జడ్జి కేబీ నర్సింహులు పుష్కరస్నానం ఆచరించారు. కార్యక్రమంలో అర్చకులు విస్సావజ్జుల నరేష్‌శర్మ, ముక్కామల రాజశేఖరశర్మ, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు శేఖర్, రవి, మూర్తి, మాజీ సర్పంచ్‌ చంద్రశేఖర్, ముప్పా మోహన్‌రెడ్డి, తునికి వీరరాఘవాచార్యులు, వెంకటనర్సయ్య పాల్గొన్నారు.  
     
    పుష్కరస్నానం ఆచరించిన అధికారులు
    కమలాపురంలోని బిల్ట్‌  ఇన్‌టేక్‌వెల్‌ వద్ద ఉన్న గోదావరిలో ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ములుగు ఆర్డీఓ చీమలపాటి మహేందర్‌జీ పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం వారు స్థానిక శివాలయంలో పూజలు చేశారు.
     
    చివరి రోజు భక్తుల సందడి 
    ఏటూరునాగారం : మండలంలోని రామన్నగూడెం పుష్కరఘా ట్‌ వద్ద 12 రోజులుగా కొనసాగిన అంత్యపుష్కరాలు ము గిశాయి. చివరి రోజు వందలాది మంది భక్తులు ఘాట్‌ వద్దకు తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించి పూజలు చేశారు. మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుని శివాలయం, గంగాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గోదావరిలో దీపాలు వది లి పిల్లాపాపలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. కాగా, సా యంత్రం వేళలో అర్చకులు పుల్లయ్యచారి, నర్సింహచారి గోదావరికి హారతి ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నరేందర్, డాక్టర్‌ అల్లి నవీన్, సర్పంచ్‌ బొల్లె జ్యోతి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యురాలు దొడ్డ పద్మ, కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement