నిజామాబాద్ జిల్లా తొర్తి గ్రామం
మోర్తాడ్ (బాల్కొండ): పచ్చని పంటపొలాలతో కనువిందుచేసే నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో సాంఘిక దురాచారం తారస్థాయికి చేరింది. గ్రామంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి బుధవారం పరస్పరం సాంఘిక బహిష్కరణకు దిగారు. ఇరవై రోజుల కిందట వరి కోత యంత్రాలను అద్దెకిచ్చే విషయంలో ఇరువర్గాల మధ్య ఏర్పడిన వివాదం చివరకు పరస్పరం బహిష్కరణకు దారితీసింది.
వరికోత యంత్రాలు తమ సామాజిక వర్గానికి చెందినవారి పొలాల్లోనే పనిచేయాలని ఒక వర్గం కట్టుబాటు విధించడంతో మరో వర్గం అభ్యంతరం తెలిపింది. అంతకుముందే గ్రామస్తుల మధ్య పలు అంశాలపై భేదాభిప్రాయాలున్నాయి. చివరికి ఒక కులానికి చెందిన సుమారు వంద కుటుంబాలు ఒక సమూహంగా, మిగతా కులాలకు చెందిన 320 కుటుంబాలు మరో సమూహంగా చీలిపోయాయి. ఈ నేపథ్యంలో భూముల కౌలును కూడా రద్దు చేసుకున్నారు. కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఆటోలు ఇతర వ్యాపార సంస్థలను ఎవరికి వారు విభజించుకుని.. ఒక వర్గం వారు మరో వర్గంలోని దుకాణాలకు వెళ్లకుండా కట్టడి చేసుకున్నారు. (చదవండి: స్ఫూర్తి మినియేచర్ సృష్టి... మది దోచే మట్టి రూపాలు)
అన్ని కులాల సమూహానికి సంబంధించిన ఆటోలలో ప్రయాణిస్తే రూ.50 వేల జరిమానా చెల్లించాలని ఒక వర్గం.. తమవారికి కట్టుబాటు విధించింది. మరో పక్క ఒక కులం వర్గం వారికి ఎవరైనా సహకరిస్తే రూ.లక్ష జరిమానా అని మరో వర్గం నిబంధన విధించింది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామంలో శాంతియుత వాతావరణం ఏర్పరచాలని పొరుగు గ్రామాలవారు కోరుతున్నారు. (చదవండి: బిగపట్టుకుని.. ఒకరి తరువాత ఒకరు)
Comments
Please login to add a commentAdd a comment