సీఎం వస్తే ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వరా? | collecter not fallowing protocall, ysrcp mlas alleged | Sakshi
Sakshi News home page

సీఎం వస్తే ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వరా?

Published Sat, May 9 2015 3:50 AM | Last Updated on Tue, May 29 2018 2:55 PM

collecter not fallowing protocall, ysrcp mlas alleged

- ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు

కడప:  రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వక పోవడంలో అర్థం ఏమిటని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా ఎమ్మెల్యేలు ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీశారు. పత్రికల్లో చూసి తెలుసుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కమలాపురం, మైదుకూరు, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, ఎస్‌బీ అంజద్‌బాషా, మేయర్  కె. సురేష్‌బాబు జిల్లా అధికార యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమకు సమాచారం ఇవ్వకుండా అవమానించి, ప్రొటోకాల్‌ను ఉల్లంఘించినందుకు నిరసనగా తాము సీఎం పర్యటనను బహిష్కరిస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement