రెండు వర్గాలుగా చీలిన చిరంజీవి అభిమానులు
కాంగ్రెస్‌లో పనిచేయాలని ఓ వర్గం హెచ్చరిక
పార్టీలో చేరే ప్రసక్తేలేదని తేల్చిన చెప్పిన మరో వర్గం
జన్మదిన వేడుకల్లో రగడ
నెల్లూరు, సిటీ : మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో అభిమానుల మధ్య ఉన్న విభేదాలు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్‌లో చేరితేనే చిరంజీవి అభిమానులుగా గుర్తింపు ఉంటుందని జిల్లా చిరంజీవి యువత అసోసియేషన్ తేల్చిచెప్పింది. పార్టీ తలపెట్టిన కార్యక్రమాలకు హాజరుకావాలని హుకుం జారీ చేశారు. తాము ఇతర పార్టీలో ఉంటామని, అభిమానులుగా కార్యక్రమాలు చేస్తామని మరో వర్గం చెప్పింది. చిరంజీవి యువత నాయకులకు కాంగ్రెస్‌పార్టీలో చేరమని తేల్చిచెప్పారు. చిరంజీవి అభిమానులు రక్తదాన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనేవారు. అయితే జిల్లాలో రెండుగా చీలిన అభిమానులు రక్తదాన కార్యక్రమాలకు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి జన్మదిన సందర్భంగా సోమవారం ఏ ప్రాంతంలో కూడా రక్తదాన కార్యక్రమం చేపట్టలేదు.
విడివిడిగా కార్యక్రమాలు
రాష్ట్ర, జిల్లా చిరంజీవి యువత అసోసియేషన్‌లు రెండుగా చీలాయి. చిరంజీవి పుట్టినరోజు వేడుకలను చిరంజీవి యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సుజయ్‌బాబు, చక్రధర్‌రెడ్డిలు తన వర్గంతో కలిసి విడిగా కార్యక్రమం చేశారు. అదే విధంగా జిల్లా చిరంజీవి యువత జిల్లా నాయకులు విడిగా మరో కార్యక్రమం చేశారు.
టీడీపీ నాయకులతో కేక్ కట్ చేస్తారా? –సుజయ్‌బాబు, చిరంజీవి యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
చిరంజీవి యువత జిల్లా నాయకులు కాంగ్రెస్‌పార్టీలో చేరాలని హుకుం జారీ చేయడం దారుణం. సినీ అభిమానం, రాజకీయ అభిమానం వేరు. కాంగ్రెస్ పార్టీలో చేరమని బలవంతం చేయడం సరికాదు. టీడీపీ నాయకులు ధనుంజయ్‌రెడ్డి చేత కేక్ కట్ చేయించడం ఎంత వరకు సమంజసం.