జిల్లాలోని పెరవలిలో సాగునీటిపారుదల సలహామండలి సమావేశం రసాభాసగా మారింది.
పశ్చిమ గోదావరి: జిల్లాలోని పెరవలిలో సాగునీటిపారుదల సలహామండలి సమావేశం రసాభాసగా మారింది. కార్యక్రమంలో జరుగుతున్న సమయంలో రైతులకు, నిడదవోలు ఎమ్మెల్యే శేషారావుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనను చిత్రిస్తున్న మీడియాపై ఆర్డీవో శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలు తీస్తే కెమెరాలు లాక్కుంటానంటూ మీడియా ప్రతినిధులను బెదిరించారు.