భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగే రామమందిర నిర్మాణం మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని, శంకుస్థాపన వేడుక రోజున మట్టి దీపాలను వెలిగించాలని ప్రజలను కోరారు. ‘ అయోధ్య రామ మందిర నిర్మాణంతో ప్రధాని మోడీ నాయకత్వంలో దేశానికి రామ రాజ్యం వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఆగస్టు 4 & 5 తేదీ రాత్రుల్లో ప్రజలందరూ వారి ఇళ్ళ వద్ద మట్టి దీపాలను వెలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
చదవండి: అయోధ్యలో కరోనా కలకలం
అనేక మంది ప్రముఖులు, కనీసం 200 మంది అర్చకులు పాల్గొనే ఈ వేడుకలో ప్రధాని మోదీ రామ మందిరాని బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. రామ మందిర కాంప్లెక్స్‌లో ఉన్న 14 మంది పోలీసు సిబ్బందికి, పూజరులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అలాగే ఆ కార్యక్రమానికి ఆహ్వానించిన కొందరి ప్రముఖులకు, అదేవిధంగా హోం మంత్రి అమిషాతో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఏదేమైనా, కరోనా నేపథ్యంలో అన్ని భద్రతా నియమాలను పాటిస్తూ, ప్రణాళిక ప్రకారం అన్ని ముందుకు సాగుతాయని ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఇప్పుడు నిర్మిస్తున్న ఆలయం మొదట అనుకున్నదానికంటే రెట్టింపు పరిమాణంలో ఉంటుందని భావిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో, అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయాన్ని నిర్మించడానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కొత్త మసీదును నిర్మించుకోవడానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రానికి ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా ప్రస్తుతం, ఉత్తర ప్రదేశ్‌లో 38,023 యాక్టివ్ కరోనావైరస్ కేసులు ఉన్నాయి.
చదవండి: భారీగా ఆలయ నిర్మాణం
Comments
Please login to add a commentAdd a comment