లక్నో: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముందు ప్రత్యేక అనుష్ఠాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. నేటి నుంచి 11 రోజులపాటు జరిగే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ చారిత్రక శుభకరమైన సందర్భం తన హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. రామాలయ కార్యక్రమానికి ప్రజలందరి ఆశీస్సులను కోరారు.
"రామ మందిరం ప్రాణ ప్రతిష్ట'కు ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సంప్రోక్షణ సమయంలో భారతదేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేందుకే దేవుడు నన్ను సృష్టించాడు. దీనిని దృష్టిలో ఉంచుకుని నేను ఈ రోజు నుండి 11 రోజుల పాటు ప్రత్యేక పూజను ప్రారంభిస్తున్నాను." అని ప్రధాని మోదీ చెప్పారు.
'ఎప్పటి నుంచో ఎదురుచూసిన ఈ సమయంలో మనోభావాలను వ్యక్తీకరించడం కష్టంగా ఉంది. నేను భావోద్వేగానికి లోనయ్యాను. నా జీవితంలో మొదటిసారిగా నేను అలాంటి భావాలను తెలుసుకుంటున్నాను" అని ప్రధాని మోదీ చెప్పారు. అటు.. 'ప్రాణ్ ప్రతిష్ట' వేడుకకు సంబంధించిన గ్రంథాలలో వివరించిన కఠినమైన మార్గదర్శకాలను ప్రధాని మోదీ అనుసరిస్తారని అధికారులు తెలిపారు.
అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. అందుకు 11 రోజుల నుంచే ప్రత్యేకమైన కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమవుతాయి.
ఇదీ చదవండి: రామ మందిర ప్రతిష్టాపన.. ఆ మూడు రాష్ట్రాల్లో 'డ్రై డే'
Comments
Please login to add a commentAdd a comment