అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను యూపీలోని గోసాయిగంజ్ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే అభయ్ సింగ్ దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయన చిన్నపిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో అభయ్ సింగ్ బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేశారు. పార్టీకి దూరమైన అనంతరం అయోధ్యకు వచ్చిన ఆయన బాలరాముని ముందు సాష్టాంగపడి భావోద్వేగానికి గురయ్యారు.
అయోధ్యలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గత జనవరి 22వ తేదీన జరిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాలనుకున్నామని, అయితే తమకు ఆహ్వానం అందలేదన్నారు. దీంతో తమను రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తీసుకెళ్లాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఎస్పీ ఎమ్మెల్యేలంతా కోరారని తెలిపారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ మినహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను అయోధ్యకు తీసుకువెళ్లారని’ ఆయన ఆరోపించారు.
తాజాగా రామ్‌లల్లాను దర్శించుకున్న ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీరాముని చిత్రాలను షేర్ చేశారు. ఇటీవలి పరిణామాలను చూస్తుంటే అభయ్ సింగ్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment