seeing
-
రామ్‌లల్లా ముందు పిల్లాడిలా ఏడ్చిన ఎమ్మెల్యే!
అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను యూపీలోని గోసాయిగంజ్ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే అభయ్ సింగ్ దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయన చిన్నపిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో అభయ్ సింగ్ బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేశారు. పార్టీకి దూరమైన అనంతరం అయోధ్యకు వచ్చిన ఆయన బాలరాముని ముందు సాష్టాంగపడి భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గత జనవరి 22వ తేదీన జరిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాలనుకున్నామని, అయితే తమకు ఆహ్వానం అందలేదన్నారు. దీంతో తమను రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తీసుకెళ్లాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఎస్పీ ఎమ్మెల్యేలంతా కోరారని తెలిపారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ మినహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను అయోధ్యకు తీసుకువెళ్లారని’ ఆయన ఆరోపించారు. తాజాగా రామ్‌లల్లాను దర్శించుకున్న ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీరాముని చిత్రాలను షేర్ చేశారు. ఇటీవలి పరిణామాలను చూస్తుంటే అభయ్ సింగ్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
రివర్ క్రూయిజ్ చిక్కుకోలేదు! భద్రత దృష్ట్యా అలా చేశాం
ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. లగ్జరీ రివర్ క్రూయిజ్ ఒకచోట చిక్కుకుపోయిందంటూ వచ్చిన వార్తలు గుప్పుమన్నాయి. కానీ అవి ఎంతమాత్రం వాస్తవం కావని క్రూయిజ్‌ని నిర్వహస్తున్న ఎక్సోటివ్ హెరిటేజ్ గ్రూప్ చైర్మన్ రాజ్‌సింగ్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఓడ పాట్నా చేరుకుంది. ఓడ నదిలో లంగరు వేయగా..పర్యాటకులు సందర్శన కోసం పడవలు తీసుకుని బయలుదేరారని తెలిపారు. "ఓడ ఎల్లప్పుడూ ప్రధానంగా లోతైన ప్రదేశంలోనే ఉంటుంది. పెద్ద ఓడలు ఎప్పుడూ ఒడ్డుకు వెళ్లలేవు. ఈ ఓడను చూడటానికి వేలాదిమంది తరలి వచ్చారు. ఓడ గోప్యత, ప్రయాణికుల భద్రత తదితర కారణాల రీత్యా తాము పాట్నాకి తీసుకువచ్చామని, జెట్టీకి తీసుకురాలేకపోయామని చెప్పారు". అలాగే పర్యాటకులు అక్కడ చిరాంద్ అనే పర్యాట ప్రదేశాన్ని చూడటానికి పడవలను తీసుకుని వెళ్లారని, మళ్లీ సురక్షితంగా తిరిగి వచ్చేశారని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని షాహిగంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, అస్సాంలోని గౌహతి, బంగ్లాదేశ్‌లోని ఢాకా వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రాంతాలను ఈ క్రూయిజ్ కవర్ చేస్తుంది. శాకాహార భారతీయ వంటకాలు, ఆల్కహాల్ లేని పానీయాలు, స్పా, కాల్‌లోనే అందుబాటులో ఉండే వైద్యులు తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఈ రివర్ క్రూయిజ్‌కి రోజుకు సుమరు రూ. 25 వేల నుంచి రూ. 50 వేలు వరుకు ఖర్చు అవుతుంది. మొత్తం 51 రోజుల ప్రయాణానికి ప్రతి ప్రయాణికుడికి దాదాపు రూ. 20 లక్షలు ఖర్చవుతుంది. (చదవండి: ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు) -
పిల్లితో భారీ వ్యాపారం!
జపాన్ః వ్యాపారాభి వృద్ధికోసం ఒక్కొక్కరు ఒక్కో టెక్నిక్ ఉపయోగిస్తారు. ముఖ్యంగా జనాన్ని ఆకట్టుకోడానికి రకరకాల ఎత్తులు వేస్తుంటారు. కొందరు మాటలతోనే కొనుగోలుదారులను ఆకట్టుకోడానికి చూస్తే.. మరికొందరు డెకరేషన్లు,లైటింగ్ లు వంటి అనేక రకాల ఆకర్షణలను ఎర వేస్తుటారు. అయితే జపాన్ లో మాత్రం ఓ పిల్లి..తనదైన శైలిలో చిన్నారులను ఆకట్టుకుంటూ.. తన వ్యాపారాన్ని చలాకీగా సాగించేస్తోంది. పిల్లి వ్యాపారం చేయడమేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అమెరికాలో అందరూ ఇష్టపడే హాట్ డాగ్స్..., సింగపూర్ లో వేడినుంచీ ఉపశమనాన్నిచ్చే ఐస్ క్రీమ్స్ లాగానే... జపాన్ లో జనం యాకీ ఇమో (రోస్టెడ్ స్వీట్ పొటాటో) ను అమితంగా ఇష్టపడతారు. ముఖ్యంగా చలికాలంలో ఈ యాకీ ఇమో అమ్మకాలు భారీగా జరిపేందుకు టొట్టోరి ప్రిఫిక్చర్, కురాయోషి నగరంలో ఓ లెజెండరీ క్యాట్ రంగంలోకి దిగింది. జనం ఎంతో ఇష్టంగా తినే ఐటెమ్ అయినా వ్యాపారానికి మాత్రం పోటీ తప్పదు కదా. అందుకే ఇక్కడ యాకీ ఇమో వ్యాపారి తనదైన శైలిలో పిల్లలను ఆకట్టుకునేందుకు ఓ అందమైన పిల్లిని ఆయుధంగా చేసుకున్నాడు. పిల్లిలాటి కోటును ధరించి పిల్లలను ఆకట్టుకుంటూ చలాకీగా అమ్మకాలు జరిపేయడమే కాదు... వారితో కలసి సెల్ఫీలు, ఫోటోలు తీయించుకుంటూ హుషారుగా వ్యాపారం చేసేస్తున్నాడు. బొమ్మలంటే చిన్నారులు ఎంతో ఇష్టపడతారన్న ఉద్దేశ్యంతో తన వ్యాపారాభివృద్ధికి 'మికెనెకో యమాడా'.. ఈ కొత్త ప్రయోగాన్ని ప్రవేశ పెట్టాడు. దీంతో పిల్లలంతా యమాడా రోస్టింగ్ స్టాండ్ దగ్గరకు పరుగులు తీస్తున్నారు. యాకీ ఇమోలను తినడంకన్నా పిల్లి బొమ్మను ఇష్టంగా చూస్తూ షేక్ హ్యాండ్ లు, హాయ్.. బాయ్.. లు చెప్తున్నారు. ఇలా వినూత్న తరహాలో అమ్మకాలను పెంచుకుంటున్న మికెనెకో ఆధునిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగించుకొని తాను ఏరోజు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో ముందుగానే ట్వీట్ చేస్తున్నాడు. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే జపాన్ వీధులు యాకీ ఇమోల వ్యాపారులతో కళకళ్ళాడుతాయి. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో ఇండియాలో మిర్చి బజ్జీలు, నిప్పుల్లో కాల్చిన జొన్న కండెలు తిన్నట్లుగా అక్కడి జనం.. గులకరాళ్ళపై రోస్ట్ చేసే స్వీట్ పొటాటోలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే కొందరు ఈ యాకీ ఇమోలను రాలిన ఆకుల మంటతోనూ, బొగ్గులపైనా కూడా రోస్ట్ చేస్తుంటారు. వేగంగా పని అయిపోవాలనుకునే మరి కొందరు రోస్ట్ చేసేందుకు మైక్రోవేవ్ ను కూడా వినియోగిస్తారు. కానీ అన్నింటికంటే గులకరాళ్ళపై రోస్ట్ చేసే వాటినే జపాన్ జనం ఎక్కువగా ఇష్టపడతారు. మరి కొనుగోలుదారులను ఆకట్టుకొనేందుకు ఇతర దేశాలవారూ ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చేమో చూడండి..!