థాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..! | Ayutthaya The Ayodhya Of Thailand, Know Its History And How It Is Linkend To Lord Ram - Sakshi
Sakshi News home page

Thailand Ayutthaya History In Telugu: Aథాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!

Published Wed, Apr 17 2024 12:24 PM | Last Updated on Wed, Apr 17 2024 1:15 PM

The Ayodhya Of Thailand History And How Is Linkend To Lord Ram  - Sakshi

థాయిలాండ్‌లో నేటికి రామ రాజ్యమే

జాతీయ గ్రంథం రామాయణం

థాయి అధికారిక రాజధాని పేరు మహేంద్ర అయోధ్య

పార్లమెంటు ఎదురుగా గరుడు బొమ్మ

థాయిలాండ్లో ఒక రామరాజ్యం ఉంది అనేది మనలో చాలామందికి తెలియదు. మన దేశంలో ఉన్నట్లే అక్కడ ఒక అయోధ్య ఉంది. అక్కడ అడుగడుగున రామరాజ్యమే కనిపిస్తుంది. వారి జాతీయగ్రంథం కూడా రామాయణమే. ఇవన్నీ వింటుంటే అది థాయిలాండ్‌ దేశమేనా..? అని ఆశ్యర్యంగా ఉంటుంది. అస్సలు మన రాముడితో వారికి సంబంధం ఎలా ఏర్పడింది?. మన రాముడి గొప్పతనం అక్కడ వరకు ఎలా వెళ్లింది..? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం!.

శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్" అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు. వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక  గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండలోని 70, 71 & 73 సర్గలలో రాముని వివాహాన్ని, తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే.  మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది.

జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీ నది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా సీతారాములకు లవ కుశులు, ఊర్మిళా లక్ష్మణులకు అంగద చంద్రకేతులు, మాండవీభరతులకు పుష్కరుడు, తక్షుడనే వాళ్ళు, శృతకీర్తి శతృఘ్నులకు సుబాహువు, శతృఘాతకుడనే వాళ్ళు జన్మించారు. 

శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది..
పశ్చిమంలో లవునకు లవపురం (లాహోర్), తూర్పున కుశునకు కుశావతి, తక్షునకు తక్షశిల, అంగదునకు అంగదనగరం, చంద్రకేతునకు చంద్రావతిలను ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పు దిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగ వంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణు భగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా! అందువలన వీళ్ళు తమ పేర్లచివర రామ్ అన్న పేరు తగిలించుకుని, వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే భూమిబల్అతుల్యతేజ్.

థాయిలాండ్‌లోని మరో అయోధ్య..
థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో బ్యాంకాక్‌ అని అంటున్నాము కదా! అయితే ప్రభుత్వ రికార్డులలో అధికారిక రాజధాని పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధానులలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్, ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి.  "క్రుంగదేవ మహానగర అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి" థాయి భాషలో పై పేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకో విశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు, పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. అంటే అర్థం..ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోధ్యలోనే నివసిస్తారు.

థాయిలాండ్‌లో నేటికి రామరాజ్యం ..
థాయిలాండ్‌లో 192 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా, రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వాళ్లనెవరినీ విమర్శించడం గానీ, వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులుగా భవించి గౌరవప్రదంగా చూస్తారు . రాజవంశం వారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూ ధర్మశాస్త్ర పరిజ్ఞానముంది.

థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం
థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా, వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకి రామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణ శక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట.

రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మన దేశంలో లాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం. అంతేగదు రామాయణంలోని సన్నివేశాలతో నాటకాలు, తోలుబొమ్మలాటలు ఉన్నాయి. ఇక ఇక్కడ బౌద్ధులు అధిక సంఖ్యాకులు, హిందువులు అల్పసంఖ్యల్లో ఉన్నారు. అయితే బౌద్ధులు హిందూ దేవీ దేవితలను ఆరాధించటం విశేషం.

థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు
గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈ జాతి లుప్తమై పోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి ( The Brahmany Kite ) అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షి శాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణు భగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక, ఆ రాముడు విష్ణువు అవతారమనీ, ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతే కాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు.

థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి..
మన దౌర్భాగ్యం స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ, హిందూసంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ, థాయిలాండ్ రారాజధానిలోని ఎయిర్ పోర్ట్‌కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణ భూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 5,63,000 స్క్వేర్‌ మీటర్‌. ఎయిర్ పోర్టు ముందు "సముద్ర మథనం" ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు, రాక్షసులు చేసే క్షీరసాగర మథనాన్ని చూపిస్తుంది. మన పిల్లలకు, రాబోయేతరాలకు మనసంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి.

(చదవండి: రామయ్యకు నైవేద్యంగా వడపప్పు, పానకమే ఎందుకు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement