గాజా ఆసుపత్రి ఘటన: ప్రధానిమోదీ తీవ్ర దిగ్భ్రాంతి | Israel-Hamas War: PM Modi Shocked At The Tragic Loss Of Lives At The Al Ahli Hospital In Gaza - Sakshi
Sakshi News home page

గాజా ఆసుపత్రి ఘటన: ప్రధానిమోదీ తీవ్ర దిగ్భ్రాంతి

Published Wed, Oct 18 2023 2:29 PM | Last Updated on Wed, Oct 18 2023 3:08 PM

PM Modi shocked at the tragic loss of lives at the Al Ahli Hospital in Gaza - Sakshi

గాజా (Gaza) ఆసుపత్రిపై దాడి ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేద్ర మోదీ  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో జరిగిన ఘోరమైన ప్రాణనష్టంపై  బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ మోదీ ట్వీట్  చేశారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతున్న సంఘర్షణలో  పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై  మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.  ఇది చాలా తీవ్రమైన అంశం, బాధ్యులకు తగిన శిక్ష పడాలన్నారు.

కాగా సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లి ఆసుపత్రిపై జరిగిన దాడిలో కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.  ఈ దాడిని ఇప్పటికే చాలా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. మరోవైపు తాజా ఘటనపై రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌ సైన్యమే వైమానికి దాడికి పాల్పడిందంటూ హమాస్‌ ఆరోపిస్తుండగా,  ఉగ్రవాదుల పనే  అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు ఆరోపించారు.ఈ పేలుడుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. పీఐజే ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్‌ గురి తప్పి ఆసుపత్రిపై పడిందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement