ఫరీదాబాద్(హరియాణా): భారత్‌లో ఆరోగ్య సంరక్షణకు, ఆధ్యాత్మికతకు దగ్గరి సంబంధముందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బుధవారం హరియాణాలోని ఫరీదాబాద్‌లో 2,600 పడకల భారీ, అధునాతన అమృత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించి మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. మాతా అమృతానందమయి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
‘కోవిడ్ ఉధృతి కాలంలో కరోనా టీకాలపై కొందరు దుష్ప్రచారం చేశారు. వాటికి ఆధ్యాత్మికవేత్తలు అడ్డుకట్టవేశారు. దీంతో ప్రజలంతా కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భాగస్వాములయ్యారు. దేశంలో వ్యాక్సినేషన్ విస్తృతమైంది. స్పిరిట్యువల్– ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విజయానికి చక్కని ఉదాహరణ ఇది. భారత్‌లో ఆరోగ్య సంరక్షణకు, ఆధ్యాత్మికతకు అంతర్లీన సంబంధముంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. అమృత ఆస్పత్రిని 130 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఆస్పత్రి భవంతిపై హెలిప్యాడ్ సౌకర్యముంది. మరోవైపు, ప్రధాని పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌లో 300 పడకల హోమీ బాబా క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు. హెల్త్‌కేర్ రంగంలో దేశంలో గత ఏడు దశాబ్దాల్లో జరగనంత అభివృద్ధి ఈ ఎనిమిదేళ్లలో సాకారమైందని మోదీ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: స్వతంత్ర మీడియాని అణచివేసేందుకు యత్నాలు
Comments
Please login to add a commentAdd a comment