సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, గ్రాంట్లపై చర్చించిన్నారు. పాలమూరు-డిండి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని విన్నపించారు. కాగా రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి వీరిద్దరు నేతులు దేశ ప్రధానిని కలుస్తున్నారు.
కాగా ఆరున్నర లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ ఉందని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయగా.. ఈ అంశాలను సీఎం, డిప్యూటీ సీఎం ప్రధానికి వివరించారు. తెలంగాణను ఆదుకునేందుకు తగిన ఆర్థిక చేయూత ఇవ్వాలని కోరారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కూడా రేవంత్, భట్టిలు సమావేశం కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత కె.సి.వేణుగోపాల్‌తో పాటు వీలును బట్టి రాహుల్‌గాందీతో కూడా ఈ ఇరువురు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై పార్టీ పెద్దలతో ఇరువురు నేతలు చర్చిస్తారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి.
చదవండి: తెలంగాణలో కోవిడ్ మరణం.. స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment