
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు వచ్చే నెల భారత్‌లో పర్యటించనున్నారు. అక్టోబర్ రెండో వారంలో మొయిజ్జు భారత్‌లో పర్యటించనున్నట్లు మాల్దీవులు అధికారిక వర్గాలు ప్రకటించించాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన ప్రధాని మోదీతో చర్చించనున్నట్లుగా వెల్లడించాయి.
ఇటీవల ఇరు దేశాల మధ్య తలెత్తిన దౌత్య విభేదాల తర్వాత.. ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి. జూన్ 9న ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా ముయిజ్జు భారత్‌ను చివరిసారి సందర్శించారు. తాజా ధ్వైపాక్షిక పర్యటనలో అక్టోబర్ 7-9 తేదీల్లో ఆయన భారత్‌కు రానున్నారని, 8వ తేదీన ప్రధాని మోదీ, ఇతర అధికారులతో చర్చలు జరపనున్నారని సమాచారం. ఇరుదేశాల సత్సంబంధాల బలోపేతంతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇతర విషయాల గురించి ప్రధాని మోదీతో చర్చించనున్నారని సంబంధింత వర్గాలు పేర్కొన్నాయి.
నవంబర్ 2023లో ముయిజ్జు మాల్దీవులు అధ్యక్షుడైన తర్వాత భారత్‌తలో ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారి. గతంలో భారత్ బలగాలు మాల్దీవులను విడిచివెళ్లిపోవాలని షరతు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్లో మోదీ కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పర్యటించిన సమయంలో.. కొందరు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దూరం మరింత పెరిగింది.
చదవండి: సీఎం సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసుల ఎఫ్‌ఐఆర్ నమోదు
Comments
Please login to add a commentAdd a comment