మాలె: భారత్‌తో దౌత్యసంబంధమైన వివాదం కొనసాగుతన్న వేళ మాల్దీవుల మంత్రి మరియం షియునా ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ పోస్టు మరోసారి వివాదాస్పదమైంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఆమె సెస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే ఆమె ఇటీవల ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదం కావటంతో క్షమాపణలు తెలిపారు. మరియం ఇటీవల ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ పోస్టులోని ఫొటో భారత జాతీయ జెండాలోని అశోకచక్రాన్ని పోలి ఉండటం వివాదం అయింది.
‘నేను ఇటీవల ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ పోస్టుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. నా పోస్ట్‌లోని కంటెంట్ వల్ల ఎవరినైనా కించపరిచినట్లు అయితే ఇవే నా క్షమాపణలు. నేను ఆ పోస్ట్ మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ ఎండీపీని విమర్శిస్తూ ఓ ఫొటో పెట్టాను. అయితే అది భారతీయ జెండాను పోలినట్లు ఉండటం నా దృష్టికి వచ్చింది.
.. అందుకే వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశా. అది నేను ఉద్దేశపూర్వంగా పెట్టిన ఫొటో కాదు. ఆ ఫొటోలో ఏదైనా అపార్థం కలిగించినందుకు నేను చింతిస్తున్నా. మాల్దీవుల భారత్‌తో సంబంధాలను గౌరవిస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా సున్నితమైన అంశాను పోస్ట్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉంటాను’ అని మరియం షియునా క్షమాపణ చెబుతా వివరణ ఇచ్చారు.
డిలీట్ చేసిన పోస్ట్‌లో ఏం ఉంది?
మాల్దీవుల అధికార పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎంసీ) నేత, మంత్రి మరియం ప్రతిపక్ష పార్టీ మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ ( ఎండీపీ)ని టార్గెట్ చేస్తూ.. ఆ పార్టీ లోగోను మార్పు చేస్తూ ఒక ఫొటోతో పోస్ట్ పెట్టారు. అయితే ఆ ఫొటో భారత్ జాతీయ జెండాలోని అశోక చక్రాన్ని పోలి ఉండటం గమనార్హం. దీంతో పోస్ట్ వైరల్ అయి ఆమె విమర్శల పాలు అయ్యారు.
ఈ విషయాన్ని గుర్తించిన ఆమె వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. అయితే తాజాగా ఆ పోస్ట్‌పై మరియం భారత్‌కు క్షమాపణలు తెలిపారు. ఇక.. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లక్ష్యదీప్ పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మాల్దీవుల మంత్రుల్లో మరియం ఒకరు. అప్పుడు ఈ విషయంపై మాల్దీవుల ప్రభుత్వం ఆ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
I would like to address a recent social media post of mine that has garnered attention and criticism .I extend my sincerest apologies for any confusion or offense caused by the content of my recent post.
— Mariyam Shiuna (@shiuna_m) April 8, 2024
It was brought to my attention that the image used in my response to the…
Comments
Please login to add a commentAdd a comment