మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు అక్కసు
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత వ్యతిరేకతను వెళ్లగక్కారు. సాధారణ పౌర దుస్తుల్లోనైనా సరే భారత సైనిక సిబ్బంది తమ భూభాగంలో మే 10వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని అన్నారు. మాల్దీవుల్లో భారత్ మూడు వైమానిక కేంద్రాలను ఏర్పాటు చేసింది.
అక్కడి ప్రభుత్వం మార్చి 10వ తేదీ కల్లా భారత సైనిక సిబ్బంది వాటిని విడిచి వెళ్లిపోవాలని గడువు ప్రకటించింది. దీంతో, సైనిక సిబ్బంది నుంచి ఆ కేంద్రాల బాధ్యతలను చేపట్టేందుకు భారత్ నుంచి పౌర సిబ్బందితో కూడిన మరో బృందం అక్కడికి చేరుకున్న నేపథ్యంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు ముయిజ్జు మళ్లీ తన బుద్ధిని బయటపెట్టారు. భారతీయ సిబ్బంది ఏ రూపంలోనైనా సరే తమ దీవిలో ఉండరాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment