మాలె: మాల్దీవులుతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చేసుకోవడానికి భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ మంత్రి మహ్మద్ సయీద్ అన్నారు. అయితే దానికి సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. మాలెలో ఆర్థిక, వాణిజ్య అభివృద్ధి శాఖ మంత్రి మహ్మద్ సయీద్ మీడియాతో మాట్లాడారు.
‘‘దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(SAFTA)తో పాటు మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని భారత్ కోరుకుంటోంది. అయితే దీనికి సంబంధించిన చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం చేసుకోవడానికి అన్ని దేశాలకు అవకాశం కల్పించారు. వాణిజ్య కార్యకలాపాలను మరింత సులభతరం చేయటంలో భాగంగా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది’’ అని మహ్మద్ సయీద్ అన్నారు.
ఇక.. గతేడాది భారత ప్రధాని మోదీ లక్ష్యదీప్ పర్యటన సందర్భంగా దీగిన ఫొటోలు, వీడియోలపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బ తిన్నాయి. అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చైనా అనుకూలుడనే పేరు ఉండటం. అదే విధంగా మాల్దీవుల్లో ఉన్న భారత్ బలగాలను వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించటం వంటి వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
అయినప్పటికీ భారత్ మాల్దీవుల విజ్ఞప్తి మేరకు బడ్జెట్‌లో 50 మిలియన్ డాలర్ల అర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. 1981లో ఇండియా-మాల్దీవుల మధ్య అత్యవసర సరుకుల ఎగుమతుల కోసం వాణిజ్య ఒప్పందం కుదిరింది. 2021లో మొదటిసారి ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 300 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత సంవత్సరాల్లో అదికాస్త ఇంకా పెరుగుతూ 500 మిలియన్ డాలర్లు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment