సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
Published Fri, Aug 26 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
ఆత్మకూర్ (నర్వ) : బీడీ కట్టలపై 85శాతం గొంతు క్యాన్సర్ బొమ్మ జీఓ 727ను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేస్తు సెప్టెంబర్ 2న నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం పిలుపునిచ్చారు. శుక్రవారం అమరచింతలోని అమతం బీడీ ఫ్యాక్టరీలో మాట్లాడారు. ఎన్‌డీఏ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో దూకుడుగా ముందుకు పోతుందని విమర్శించారు. బడా కార్పొరేట్లకు మరింత సంపద చేకూర్చేందుకే ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనా విధానాలు దోహదం చేస్తున్నాయని ఆరోపించారు. పెట్టుబడిదారుల కుట్రలకు కేంద్రప్రభుత్వం వంతపాడుతూ 720 జీఓను తీసుకొచ్చి బీడీ కట్టలపై 85 క్యాన్సర్‌బొమ్మను గుర్తించడం అవివేకం అన్నారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్, చింతలన్న, రాజు, లక్ష్మి, ఇందిరా, వెంకట్‌రెడ్డి, భూషణం పాల్గొన్నారు.
Advertisement
Advertisement