న్యూఢిల్లీ: లోక్‌పాల్ ఎంపిక కమిటీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ బాయ్‌కాట్ చేసింది. ‘ప్రత్యేక ఆహ్వానితులు’గా హాజరు కావాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఖర్గేకు కేంద్రం ఇచ్చిన ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ మేరకు ప్రధానికి ఖర్గే లేఖ రాశారు. లోక్‌పాల్ ఎంపికలో ప్రతిపక్ష గొంతు లేకుండా చేసేందుకే ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారని ఆరోపించారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం ప్రకారం ఎంపిక కమిటీలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉంటారు. అయితే ఖర్గేకు ఆ హోదా లేకపోవడంతో ఆయన కమిటీలో సభ్యుడు కాదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయనను కేంద్రం పిలిచింది. లోక్‌పాల్ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎంపిక కమిటీ సమావేశం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment