సారా తయారీకి వాడే నల్లబెల్లాన్ని విక్రయించిన వారికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించటానికి కూడా వెనుకాడబోమని ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణేష్, డీఎస్పీ దక్షిణామూర్తి హెచ్చరించారు.
కూసుమంచి (ఖమ్మం) : సారా తయారీకి వాడే నల్లబెల్లాన్ని విక్రయించిన వారికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించటానికి కూడా వెనుకాడబోమని ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణేష్, డీఎస్పీ దక్షిణామూర్తి హెచ్చరించారు. మంగళవారం వారు కూసుమంచి మండల కేంద్రంలో 'సారా నిర్మూలన- బెల్లం విక్రయాలు' అంశంపై నల్లబెల్లం విక్రేతలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.
నల్లబెల్లం విక్రయిస్తే ముందుగా సాధారణ కేసులు పెడతామని, దారిలోకి రాకుంటే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు. అయినా విక్రయాలు మానకుంటే కలెక్టర్ ప్రత్యేక అనుమతితో గ్రామ బహిష్కరణ దండన విధిస్తామని తెలిపారు. సారా తయారీ నిర్మూలనకు అధికారులతో సహకరించాలని కోరారు.