గవాస్కర్, సచిన్లకు చోటు దక్కలేదు! | No place for Sachin Tendulkar, Sunil Gavaskar in Geoffrey Boycott's World XI | Sakshi
Sakshi News home page

గవాస్కర్, సచిన్లకు చోటు దక్కలేదు!

Published Fri, Dec 16 2016 3:39 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

గవాస్కర్, సచిన్లకు చోటు దక్కలేదు!

గవాస్కర్, సచిన్లకు చోటు దక్కలేదు!

సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్.. ఈ ముగ్గురూ భారత దేశ క్రికెట్ను అత్యున్నత స్థానంలో నిలిపిన క్రికెటర్లు.

లండన్:సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్.. ఈ ముగ్గురూ భారత దేశ క్రికెట్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన క్రికెటర్లు. అయితే ఇంగ్లండ్ గ్రేట్ జెఫ్రీ బాయ్ కాట్ ప్రకటించిన ఆల్ టైమ్ గ్రేట్ వరల్డ్ ఎలెవన్లో ఈ దిగ్గజ క్రికెటర్లకు చోటు లభించలేదు. తాజాగా జెఫ్రీ బాయ్ కాట్ విడుదల చేసిన జాబితాలో పాక్ మాజీ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్కు చోటు లభించింది. అంతేకాకుండా  బాయ్ కాట్ వరల్డ్ ఎలెవన్లో ఇమ్రాన్ కు కెప్టెన్ హోదా దక్కడం విశేషం.

 

1992 వరల్డ్ కప్ గెలిచిన పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖానే తన జట్టుకు సరైన నాయకుడిగా బాయ్కాట్ పేర్కొన్నాడు. అయితే భారత్ ఆటగాళ్లకు తన జట్టులో స్థానం ఇవ్వకపోవడాన్ని ముంబైలోని ఫంక్షన్కు హాజరైన బాయ్ కాట్ సమర్ధించుకున్నాడు. ఆయా శకాల ఆధారంగానే తన జట్టు ఆటగాళ్ల ఎంపిక జరిగిందన్నాడు. ఓపెనింగ్ విభాగంలో డబ్యూజీ గ్రాస్, సర్ జాక్ హాబ్స్లే గవాస్కర్ కంటే ఉత్తమమని బాయ్ కాట్ తెలిపాడు. అదే క్రమంలో గవాస్కర్ అత్యుత్తమ ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. తనకు గవాస్కర్ అత్యంత మిత్రుడని ఈ సందర్భంగా జెఫ్రీ పేర్కొన్నాడు. మరొకవైపు విండీస్ మాజీ ఆటగాళ్ల వివ్ రిచర్డ్స్, సోబర్స్లకు బాయ్ కాట్ ఆల్ టైమ్ గ్రేట్ ఎలెవన్లో చోటు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement