వెటరన్ క్రికెటర్లు సందడి చేసేందుకు మరో టీ20 క్రికెట్ లీగ్ పుట్టుకొచ్చింది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీ తొట్టతొలి సీజన్ ఈ ఏడాది జరగనుంది. సోమవారం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొదటి ఎడిషన్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాంచ్ చేశారు.
ఈ లీగ్ కమీషనర్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ నియమితుడయ్యాడు. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. ఈ ఆరు దేశాల నుంచి క్రికెట్ స్టార్లు పాల్గొనున్నారు. సచిన్ టెండూల్కర్ కూడా ఈ లీగ్‌లో భారత తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది.
"క్రికెట్‌కు భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతూనే ఉంది. గత దశాబ్దం నుంచి టీ20 క్రికెట్‌కు మరింత ఆదరణ పెరిగింది. ఈ పొట్టి క్రికెట్‌లో తమకు ఇష్టమైన మాజీ క్రికెటర్లు ఆడితే చూడాలన్న కోరిక అభిమానుల్లో ఉంది.
వెటరన్ క్రికెటర్లు ఆడే ప్రతీ లీగ్‌కు ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారని సచిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా లీగ్‌లోని మ్యాచ్‌లు ముంబై, లక్నో, రాయ్‌పూర్‌లలో జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment