బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ చాలా కష్టాల్లో ఉందన్నారు ఆయన. పలువురు బాలీవుడ్ చిత్రాలను బహిష్కరించాలంటూ సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క శాతం మంది వల్లనే బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ అవుతోందన్నారు. కొందరి వల్లే బాలీవుడ్‌కు ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. కొందరు కావాలనే బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్‌ట్యాగ్ ట్రైండ్ చేస్తున్నారని మండిపడ్డారు.
(ఇది చదవండి: ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్.. ఇండియా నుంచి ఆ రెండు చిత్రాలే)
సునీల్ శెట్టి మాట్లాడుతూ..'నేను చాలా ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నా. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ఇప్పుడు మనం కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను రూపొందించాలి. కొత్తవ్యక్తులకు సృజనాత్మకత ఉన్న వారికి అవకాశాలు కల్పించాలి. ప్రస్తుతం మనం ఇబ్బందుల్లో ఉన్నాం. ఇక నుంచి మనమేంటో నిరూపించుకోవాలి. మనల్ని మనం మెరుగు పరచుకోవాలి.' అని అన్నారు. బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టేవారు దయచేసి ఆపేయాలని విజ్ఞప్తి చేశారా సునీల్ శెట్టి.
Comments
Please login to add a commentAdd a comment