చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుపల్లిలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని గ్రామస్తులు బహిష్కరించారు.
చిత్తూరు : చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుపల్లిలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. తాగునీటి సమస్యను పరిష్కరించిన తర్వాతే గ్రామాంలోకి అధికారులు రావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చిన అధికారుల ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. చంద్రగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జోక్యంతో గ్రామస్తులు శాంతించారు. తాగునీటి సమస్యను అధికారులు త్వరలోనే పరిష్కరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దాంతో గ్రామస్తులు నిరసనను విరమించారు.