పార్టీ ఎమ్మెల్యేలనే చంద్రబాబు నమ్మటం లేదు
గుంటూరు : గుంటూరులోనే రాజధాని నిర్మాణమన్న ముఖ్యమంత్రి ఉడా పరిధిలోని ఎమ్మెల్యేలను కలిపి ఒక కమిటీగా వేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ మంత్రులు నారాయణ, పల్లె రఘునాధరెడ్డి లాంటి మంత్రులను నియమించటం వల్ల రైతులు తమ సమస్యలు చెప్పుకోలేరన్నారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలనే చంద్రబాబు నమ్మటం లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందన్నారు. జన్మభూమిలో ప్రోటోకాల్ పాటించకుండా పార్టీ కార్యక్రమంలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు, ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు.