జర్నలిస్టులకిచ్చిన హామీలు నెరవేర్చాలి | journalists demonds in boycott | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకిచ్చిన హామీలు నెరవేర్చాలి

Published Tue, Aug 23 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

journalists demonds in boycott

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : జర్నలిస్టులకిచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ అనుబంధం) జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కోసం సోమవారం కలెక్టరేట్‌ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సా«దనలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. ఆందోళనలో భాగంగా త్వరలో జాతీయ రహదారిని దిగ్బంధిస్తామన్నారు.  జర్నలిస్టులందరికీ అక్రిడేషన్‌ కార్డులు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, హె ల్త్‌కార్డులు మంజూరు చేయాలన్నారు. అనంతరం డీఆర్‌ఓ భాస్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు కిషన్‌రావు, వెంకటేశ్వర్లు, యాదగిరి, జకీ, సుభాశ్‌రెడ్డి, రఘు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement