సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
హైదరాబాద్ : మన అక్కాచెల్లెళ్లు, అమ్మలు, కూతుళ్లను దుర్భాషలాడుతూ కథనాలు ప్రసారం చేసే టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఛానళ్లను బహిష్కరించాలంటూ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. నిస్సహాయులైన చెల్లెమ్మలకు సహాయం చేయడానికి బదులుగా వారిని అశ్లీలంగా చూపిస్తూ వ్యాపారం చేసుకోవాలని చూసే ఆ ఛానల్స్‌ను బాయ్‌కాట్ చేయడం ఉత్తమమని పవన్ చేసిన ట్వీట్లకు విశేష స్పందన వస్తోంది.
ఫ్యాన్స్ ఓపికగా ఉండాలి
జనసేన కార్యకర్తలు, తన అభిమానులకు పవన్ కల్యాణ్ ఓ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి హింసాత్మక ఘటనల్లో మీరు తలదూర్చవద్దంటూ పవన్ ట్వీట్లు చేశారు. రేపు ఒకవేళ శ్రీనిరాజు తనమీద పరువునష్టం కేసు వేసినా మీరు నిగ్రహంగా ఉండాలని సూచించారు. కొన్ని ఛానల్స్ అధినేతలు, కీలక వ్యక్తులపై న్యాయపరంగా బలమైన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పోస్టులో పవన్ పేర్కొన్నారు. తాజాగా పవన్ చేసిన ట్వీట్లు క్షణాల్లో వైరల్‌గా మారాయి.
Boycott TV9, TV5, ABN for abusing our Mothers,Daughters & Sisters
— Pawan Kalyan (@PawanKalyan) 20 April 2018
And also we have to boycott them for making business out of nudity & profanity.Making business out of a helpless sister ..
I appeal to all jansainiks to be quiet and don’t indulge in any violent acts..From tomorrow onwards SriniRaju is going to put a defamation case on me but you please restrain yourself. And I am also going for a long and powerful legal battle on these channel heads.
— Pawan Kalyan (@PawanKalyan) 20 April 2018
Comments
Please login to add a commentAdd a comment