Srini raju
-
టీడీపీ నినాదం.. ‘దూషణలనే నమ్ముకుంటాం’: పవన్
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నినాదం.. ‘దూషణలనే నమ్ముకుంటాం’ అంటూ జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్ ధ్వజమొత్తారు. ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీకి, కొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్ వరుస ట్వీట్ల పరంపర సోమవారం కూడా కొనసాగింది. ‘‘టీడీపీలో ‘తల్లులు, చెల్లెళ్లను తిట్టే వింగ్’ ప్రధాన కార్యదర్శి ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు.. బూతుజ్యోతి రత్న ఆర్కే’’ అంటూ పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నిస్తే శ్రీసిటీ శ్రీనిరాజు అతని లాయర్ ద్వారా నాకు లీగల్ నోటీసులు పంపారని.. ఇందులో ఉన్న మతలబు ఏంటో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. తర్వాత శ్రీనివాసరాజు చలపతి 2009–10 ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి రూ.కోటి విరాళం ఇచ్చారంటూ కొన్ని పేపర్లను ట్వీటర్లో ఉదహరించారు. తమ లాంటి వారిపై ఆ మూడు చానల్స్ చేస్తోన్న మానసిక అత్యాచారాలను నిరోధించడానికి ఎలాంటి ‘నిర్భయ చట్టం’ కావాలని ప్రశ్నించారు. 6 నెలల పాటు తనపై బహిరంగ దూషణలు చేసి, మానసిక అత్యాచారాలు చేసి చాటుమాటుగా క్షమాపణలు చెబుతానంటే తన దగ్గర కుదరదని స్పష్టం చేశారు. వృద్ధురాలైన తన తల్లినీ వదలకుండా దూషించి, ఇప్పుడు క్షమాపణలు చెబుతామంటూ రహస్యంగా తనకు లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. అలాగే ‘మనల్ని, మన తల్లులను, ఆడపడుచులను తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి? వాళ్ల టీవీలు ఎందుకు చూడాలి? అని ప్రశ్నించారు. జర్నలిజం విలువలు, సమదృష్టి కోణంతో ఉండే చానల్స్, పత్రికల పక్షాన నిలబడతాం’ అని పేర్కొన్నారు. అలాగే త్వరలోనే తెలుగు చిత్రపరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటవుతుందని, దీనికి జనసేన వీరమహిళా విభాగం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే సోమవారం రాత్రి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ (ఆర్కే) కుటుంబ ఫొటో ఉంచి.. ‘‘బాబూ.. నాన్నగారికి రాత్రి భోజనంలో అన్నం, కూర, పప్పుతో పాటు కొంచెం సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా.. అలాగే సంస్కారవంతమైన సబ్బుతో తలస్నానం చెయ్యమని చెప్పండి..’’ అని వ్యంగ్యంగా పోస్టు చేశారు. మంగళవారం తన చిత్తూరు జిల్లా పర్యటన వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. -
పవన్ సంచలన ట్వీట్లు.. క్షణాల్లో వైరల్
హైదరాబాద్ : మన అక్కాచెల్లెళ్లు, అమ్మలు, కూతుళ్లను దుర్భాషలాడుతూ కథనాలు ప్రసారం చేసే టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఛానళ్లను బహిష్కరించాలంటూ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. నిస్సహాయులైన చెల్లెమ్మలకు సహాయం చేయడానికి బదులుగా వారిని అశ్లీలంగా చూపిస్తూ వ్యాపారం చేసుకోవాలని చూసే ఆ ఛానల్స్‌ను బాయ్‌కాట్ చేయడం ఉత్తమమని పవన్ చేసిన ట్వీట్లకు విశేష స్పందన వస్తోంది. ఫ్యాన్స్ ఓపికగా ఉండాలి జనసేన కార్యకర్తలు, తన అభిమానులకు పవన్ కల్యాణ్ ఓ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి హింసాత్మక ఘటనల్లో మీరు తలదూర్చవద్దంటూ పవన్ ట్వీట్లు చేశారు. రేపు ఒకవేళ శ్రీనిరాజు తనమీద పరువునష్టం కేసు వేసినా మీరు నిగ్రహంగా ఉండాలని సూచించారు. కొన్ని ఛానల్స్ అధినేతలు, కీలక వ్యక్తులపై న్యాయపరంగా బలమైన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పోస్టులో పవన్ పేర్కొన్నారు. తాజాగా పవన్ చేసిన ట్వీట్లు క్షణాల్లో వైరల్‌గా మారాయి. Boycott TV9, TV5, ABN for abusing our Mothers,Daughters & Sisters And also we have to boycott them for making business out of nudity & profanity.Making business out of a helpless sister .. — Pawan Kalyan (@PawanKalyan) 20 April 2018 I appeal to all jansainiks to be quiet and don’t indulge in any violent acts..From tomorrow onwards SriniRaju is going to put a defamation case on me but you please restrain yourself. And I am also going for a long and powerful legal battle on these channel heads. — Pawan Kalyan (@PawanKalyan) 20 April 2018 -
పరిస్థితులు అనుకూలించకే టీవీ9 ఎగ్జిట్‌లో జాప్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే మీడియా కంపెనీ టీవీ9 గ్రూప్ మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఏబీసీఎల్) నుంచి వైదొలగడంలో జాప్యం జరుగుతోందని వెంచర్ క్యాపిటలిస్ట్, పీపుల్ క్యాపిటల్ ఎండీ శ్రీని రాజు చెప్పారు. ప్రస్తుతం ఈ సంస్థలో తమతో పాటు మరికొందరు ఇన్వెస్టర్లకు సుమారు 80 శాతం వాటాలు ఉన్నాయని వివరించారు. మొత్తం మీద ఇందులో రూ. 100 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన ‘టై ఎంట్రప్రెన్యూరియల్ సమిట్’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శ్రీని రాజు ఈ విషయాలు వివరించారు. రుణ సంక్షోభంలో చిక్కుకున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ వ్యవహారం చాలా సంక్లిష్టమైనదని రాజు చెప్పారు. ఇది తమలాంటి ఇన్వెస్టర్లకు అనువైనది కాదన్నారు. గతంలో ఇన్వెస్ట్ చేసిన కొన్ని సంస్థల నుంచి వచ్చే రెండు, మూడేళ్లలో వైదొలుగుతున్నామని రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశం గడ్డు కాలం ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. భారత ఎకానమీకి అంత మంచిది కాదని చెప్పారు. అయితే, కష్టకాలంలోనే నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని, పేరొందిన అనేక కంపెనీలు ఇలాంటి సమయాల్లోనే ఆవిర్భవించాయని రాజు వివరించారు. పరిస్థితులకు భిన్నంగా ఆర్థిక వ్యవస్థ 7-8 శాతం వృద్ధి సాధిస్తున్న పక్షంలో అందరికీ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆయన చెప్పారు. ‘టై’ సదస్సు.. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తగిన వేదిక కల్పించే ఉద్దేశంతో డిసెంబర్ 18-20 దాకా ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై) సంస్థ 7వ ఎంట్రప్రెన్యూరియల్ సదస్సు (టెస్ 2013) నిర్వహిస్తోంది. అమెరికా, యురప్ సహా పలు దేశాల నుంచి సుమారు 2,000 నుంచి 3,000 మంది పైచిలుకు డెలిగేట్లు, సుమారు 100 మంది ఏంజెల్ ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొంటున్నారని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం చెప్పారు. ఇలాంటి సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించడం ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. ఇన్వెస్టర్లను కలుసుకునేందుకు, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలపై అవగాహన పెంచుకునేందుకు ఇది తోడ్పడగలదని మురళి వివరించారు.