'పుష్కరాల విధులు బహిష్కరిస్తాం' | Godavari Pushkaralu boycott by Municipal sewage workers in Telangana | Sakshi
Sakshi News home page

Jul 12 2015 8:13 PM | Updated on Mar 21 2024 6:45 PM

తెలంగాణలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం ఏడో రోజుకు చేరింది. సమ్మె చేపట్టి వారం గడుస్తున్న ప్రభుత్వం వైఖరిలో మార్పు రాకపోవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాంతో సమ్మెను మరింత ఉద్దృతం చేయాలని మున్సిపల్ కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామని కార్మిక సంఘాలు ఆదివారం వెల్లడించాయి. అలాగే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించాయి. జులై 14 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల విధులకు దూరంగా ఉండాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇదే విషాయాన్ని ప్రభుత్వానికి కార్మిక సంఘాలు స్పష్టీకరించాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement