డిగ్రీ స్పాట్ బహిష్కరణ
Published Thu, Apr 20 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
కర్నూలు (ఆర్‌యూ): తమ సమస్యలను పరిష్కరించేవరకు స్పాట్ బహిష్కరణ కొనసాగుతుందని డిగ్రీ లెక్చరర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం డిగ్రీ స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూల్యాంకన రెమ్యునరేషన్ కనీస 25 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అమృతకుమార్, బాలస్వామి, వీరేష్, గోపాల్, భాస్కర్,నాగేంద్ర, లలిత, శ్వేత తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement