అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు, కాంట్రాక్టు లెక్చరర్లు
నల్ల బ్యాడ్జీలతో లెక్చరర్ల నిరసన
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకు క్రమబద్ధీకరణను పట్టించుకోకపోవడం దుర్మార్గమని కాంట్రాక్ట్ లెక్చరర్లు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ కోసం చట్టం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు.
2024, 2025 మే నెల వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశం అనంతరం బందరు రోడ్డులోని డాక్టర్ అంబేడ్కర్ స్మృతివనం వరకు ర్యాలీగా వెళ్లి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జీవో 114ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, డాక్టర్ గేయానంద్, ఉన్నత విద్యా పరిరక్షణ సమితి చైర్మన్ రాజగోపాల్, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్లు పాల్గొన్నారు.


