
వైవీయూలో తరగతుల బహిష్కరణ
వైవీయూ :
యోగివేమన విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలంటూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. బుధవారం తరగతులు బహిష్కరించి పరిపాలన భవనం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కో -కన్వీనర్ గంపా సుబ్బరాయుడు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అనుబంధ హాస్టల్స్‌లో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. క్యాంపస్‌లో క్యాంటీన్ లేకపోవడం వలన విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గ్రంథాలయంలో స్వాతంత్య్ర సమరయోధుల పుస్తకాలు, పోటీపరీక్షల పుస్తకాలను ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి వసతి కల్పించాలని కోరారు.
విద్యార్థులకు ఐడీకార్డుతో పాటు కొత్త హ్యాండ్‌బుక్‌లను ఇవ్వాలని సూచించారు. అదే విధంగా హాస్టల్స్‌లో చల్లని నీటిని ఏర్పాటు చేయాలనికోరారు. విద్యార్థుల వద్దకు విచ్చేసిన రిజిస్ట్రార్‌తో విద్యార్థులు పలు సమస్యలను విన్నవించారు. అనంతరం ఆయన ఛాంబర్‌లో విద్యార్థి సంఘనాయకులు వినతిపత్రం అందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనికి స్పందించిన రిజిస్ట్రార్ సమస్యలు పరిష్కరిస్తామని ఆందోళన విరమించాలని కోరారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రాము,సాయి, రమేష్, వైఎస్‌ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు వినయ్‌నాయక్,
కిశోర్, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు సంపత్, విద్యార్థి నాయకులు గోపాల్, ప్రవీణ్, ప్రదీప్, గురు, అభి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.