Boycott Pushpa In Karnataka: Karnataka People Fire On Pushpa Movie And Warning To Boycott - Sakshi
Sakshi News home page

Pushpa Movie: 'పుష్ప' సినిమాపై ఆగ్రహం.. బాయ్‌కాట్‌ చేస్తామని వార్నింగ్‌

Published Thu, Dec 16 2021 2:13 PM | Last Updated on Mon, Dec 20 2021 11:40 AM

Karnataka People Fire On Pushpa Movie And Warning To Boycott - Sakshi

Boycott Pushpa In Karnataka: ఐకానిక్‌ స్టార్‌ అల‍్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్ వస్తున్న 'పుష్ప: ది రైజ్‌' ప్రభంజనం మొదలు కావడానికి ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. డిసెంబర్‌ 17న ఏడు భాషల్లో పాన్‌ ఇండియాగా రిలీజ్‌ అవుతున్న 'పుష్ప' గురించి సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరెక్కనున్న 'పుష్ప' సినిమాలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నా పల్లెటూరి యువతి పాత్రలో ఆకట్టుకోనుంది. స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేసింది. ఈ మధ్యే రిలీజైన ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది!

అయితే తాజాగా ఈ మూవీకి ఒక సమస్య ఎదురైంది. అదేంటంటే.. అల్లు అర్జున్‌ నటించిన ఈ పాన్‌ ఇండియా మూవీపై కర్ణాటక ప్రజలు ఫైర్‌ అవుతున్నారు. కర్ణాటకలో కన్నడ కంటే తెలుగు వెర్షన్‌కే ఎక్కువ స్క్రీన్స్‌ కేటాయించారని మండిపడుతున్నారు. కర్ణాటకలో సినిమా విడుదల చేయాలనుకుంటే కన్నడలోనే రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే సినిమాను బాయ్‌కాట్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు. #BoycottPushpaInKarnataka అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement