దక్షిణాఫ్రికా విధానాలే దీనికి కారణమన్న అమెరికా
వాషింగ్టన్: దక్షిణాఫ్రికాలో ఈనెలలో జరిగే జీ–20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా తరఫున ఎవరూ హాజరుకాబోరని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం ప్రకటించారు. ఈ నెల 20, 21 తేదీల్లో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే విదేశాంగ మంత్రుల జీ20 చర్చలను బహిష్కరిస్తున్నట్లు రూబియో చెప్పారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం అమెరికా వ్యతిరేక ఎజెండాతో వ్యవహరిస్తున్నందువల్లే సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా గైర్హాజరు జీ20 కూటమికి పెద్ద దెబ్బే. ఉక్రెయిన్ యుద్ధంపై దౌత్యానికి ట్రంప్ మొగ్గుచూపుతున్న విదేశాంగ మంత్రుల భేటీలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో రూబియో తొలిసారిగా భేటీ అవుతారని అంతా అనుకుంటున్న వేళ అసలు అమెరికా ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిందని రూబియో ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment