ministers meeting
-
జీ20 మంత్రుల భేటీకి అమెరికా దూరం
వాషింగ్టన్: దక్షిణాఫ్రికాలో ఈనెలలో జరిగే జీ–20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా తరఫున ఎవరూ హాజరుకాబోరని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం ప్రకటించారు. ఈ నెల 20, 21 తేదీల్లో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే విదేశాంగ మంత్రుల జీ20 చర్చలను బహిష్కరిస్తున్నట్లు రూబియో చెప్పారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం అమెరికా వ్యతిరేక ఎజెండాతో వ్యవహరిస్తున్నందువల్లే సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా గైర్హాజరు జీ20 కూటమికి పెద్ద దెబ్బే. ఉక్రెయిన్ యుద్ధంపై దౌత్యానికి ట్రంప్ మొగ్గుచూపుతున్న విదేశాంగ మంత్రుల భేటీలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో రూబియో తొలిసారిగా భేటీ అవుతారని అంతా అనుకుంటున్న వేళ అసలు అమెరికా ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిందని రూబియో ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. -
బీఏసీకి హరీశ్ రాకపై అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు కోసం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో మంత్రులు, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య స్వల్ప వాగ్విదం జరిగింది. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత కేసీఆర్‌కు బదులు హరీశ్‌రావు బీఏసీ భేటీకి హాజరు కావడంపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ చాంబర్లో బీఏసీ తొలి సమావేశం ప్రారంభమైంది. అధికార పార్టీ తరఫున శ్రీధర్‌బాబు, పొన్నంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రతిపక్ష బీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావు, కడియం శ్రీహరి హాజరయ్యారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున తనకు బదులుగా హరీశ్‌రావు బీఏసీ సమావేశంలో పాల్గొంటారంటూ మాజీ సీఎం కేసీఆర్ బుధవారం స్పీకర్‌కు సమాచారం ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అయితే శ్రీధర్‌బాబు, పొన్నం అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం జరిగింది. కేసీఆర్‌కు బదులుగా తాను హాజరయ్యేందుకు స్పీకర్ అంగీకరించారని హరీశ్ చెప్పారు. అయితే ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కాబట్టి హరీశ్‌రావు హాజరయ్యేందుకు వీలు లేదని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అలా హాజరయ్యేందుకు వీలు లేదు: శ్రీధర్‌బాబు తాము ఎవరిని బీఏసీ సమావేశం నుంచి బయటకు వెళ్ళమని చెప్పలేదని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్ నిర్ణయం మేరకు బీఏసీ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ నుంచి ఇద్దరు సభ్యులకు అవకాశం కలి్పంచారని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ తరఫున మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి పేర్లు ఇచ్చారని తెలిపారు. కానీ బీఏసీ భేటీకి కేసీఆర్ రావడం లేదు కాబట్టి తాను వస్తానని హరీశ్‌రావు తెలిపారని, అయితే ఒక సభ్యుడు సమావేశానికి రావడం లేదని చెప్పి అతడి స్థానంలో మరో సభ్యుడికి అనుమతినివ్వడం కుదరదని పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి లేఖ కూడా ఇవ్వలేదని తెలిపారు. కాగా అసెంబ్లీని ఎన్నిరోజులైనా నిర్వహించేందుకు తా ము సిద్ధమని శ్రీధర్‌బాబు చెప్పారు. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. గతంలో అనేకసార్లు మేం అనుమతించాం: హరీశ్ గతంలో తాము బీఏసీ జాబితాలో లేని వారిని కూడా పార్టీ శాసనసభా పక్ష నేత వినతి మేరకు అనుమతించిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశా రు. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ బదు లుగా ఎమ్మెల్యే బలాలను పలు సందర్భాల్లో అనుమతించామని, అవసరమైతే బీఏసీ మిని ట్స్‌ను పరిశీలించాలని అన్నారు. తాము అలా అనుమతించలేదని నిరూపిస్తే రాజీనామా చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తానని హరీశ్ స్పష్టం చేశారు. దీంతో మినిట్స్ పరిశీలించేందు కు సమయం పడుతుందని, అభ్యంతరం వ్యక్తమైన నేపథ్యంలో సర్దుకుపోవాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్ కోరారు. దీంతో మీ విచక్షణకే వదిలివేస్తున్నానంటూ హరీశ్‌రావు బీఏసీ భేటీ నుంచి బయటకు వచ్చారు. దీంతో కడియం ఒక్కరే బీఆర్ఎస్ తరఫున బీఏసీ భేటీలో పాల్గొన్నారు. -
విక్రేతల మధ్య సమాన పోటీ ఉండాలి
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఈ–కామర్స్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో ఈ రంగంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్న, పెద్ద విక్రేతల మధ్య సమాన పోటీ ఉండేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరిగిన జీ20 దేశాల వాణిజ్య, పెట్టుబడి శాఖ మంత్రుల సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ధరలు, ఫిర్యాదుల విషయంలో వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. డిజిటలీకరణ ద్వారా ఈ–కామర్స్ రంగంలో దేశాల మధ్య కార్యకలాపాలు సులభతరం అవుతాయని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) అనేది ఒక గేమ్–చేంజర్ అని మోదీ అభివరి్ణంచారు. దీనిద్వారా డిజిటల్ మార్కెట్‌ప్లేస్ వ్యవస్థను సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, సానుకూలతను ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. -
కార్మికుల్లో నైపుణ్యాలు పెంచాలి
ఇండోర్: అత్యాధునిక సాంకేతికతలను వినియోగించడంలో ఉద్యోగులకు, కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వాలని, వారిలో నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కొత్త తరం కార్మికులకు కొత్త తరం విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జి–20 దేశాల కార్మిక, ఉద్యోగ కల్పన శాఖ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో మొబైల్ వర్క్‌ఫోర్స్ అనేది వాస్తవ రూపం దాల్చబోతోందని ఉద్ఘాటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగో పారిశ్రామిక విప్లవ హయాంలో ఉద్యోగాల సృష్టికి టెక్నాలజీకి ఒక ముఖ్యమైన సాధనంగా మారిందని గుర్తుచేశారు. నూతన ఉద్యోగాల కల్పనలో ఇకపైకూడా టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. భవిష్యత్తులో ఉద్యోగులకు, కార్మికులకు స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ అనేది కీలకం కాబోతోందని అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతికతల వినియోగంలో నైపుణ్యాలు తప్పనిసరిగా పెంచుకోవాలని సూచించారు. వర్క్‌ఫోర్స్‌ను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్‌లో ‘స్కిల్ ఇండియా మిషన్’ ప్రారంభించామని తెలియజేశారు. నైపుణ్యాలను పంచుకోవాలి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతోపాటు వాటిని ఇతర దేశాలతో పంచుకొనే విషయంలో జి–20 దేశాలు చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. నైపుణ్యాల సమాచారం ఇచి్చపుచ్చుకోవాలన్నారు. భారత్‌లో కోవిడ్–19 వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సిబ్బంది, ఇతర ఉద్యోగులు, కార్మికులు ఎనలేని సేవలు అందించారని, వారు తమ నైపుణ్యాలను, అంకితభావాన్ని ప్రదర్శించారని మోదీ కొనియాడారు. సేవా సంస్కృతిని చాటిచెప్పారని, సాటి మనుషుల పట్ల కరుణ కురిపించారని ప్రశంసించారు. నైపుణ్యం కలిగిన కార్మికులను ప్రపంచానికి అందించగల అతిపెద్ద దేశంగా ఎదిగే సామర్థ్యం భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. సాంకేతికతలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలను సృష్టించడంలో భారత్‌కు అపార అనుభవం ఉందని వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధిపై తాము ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. కౌశల్ వికాస్ యోజన కింద కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్ వంటి రంగాల్లో నైపుణ్యాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. ఈ–శ్రమ్ పోర్టల్‌లో 21.8 కోట్ల మంది కార్మికులు నమోదయ్యారని మోదీ తెలిపారు. -
G20 ministerial meeting: క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ విధానం అవసరం
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలను కట్టడి చేసేందుకు అంతర్జాతీయ విధానం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే అంతర్జాతీయ రుణ సమస్యలను ఎదుర్కొనేందుకు, బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. జీ20 మంత్రుల సమావేశానికి ముందు అమెరికా, జపాన్, స్పెయిన్ తదితర దేశాల ఆర్థిక మంత్రులతో ఆమె ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో పలు అంశాలు చర్చించారు. శుక్రవారం నుంచి 2 రోజుల పాటు జరిగే జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నేతలు భారత్ వచ్చారు. ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ యెలెన్, జపాన్ ఫైనాన్స్ మినిస్టర్ షునిచి సుజుకీ తదితరులతో సీతారామన్ భేటీ అయ్యారు. సార్వభౌమ రుణాల పునర్వ్యవస్థీకరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తుండటంపై యెలెన్ అభినందించినట్లు అమెరికా ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. (ఇదీ చదవండి: Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్స్! నిజమేనా?) -
సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీసీ మంత్రుల సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీసీ మంత్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, శంకరనారాయణ హాజరయ్యారు. రానున్న రోజుల్లో జిల్లాల వారీగా బీసీ సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం వచ్చాక బీసీలకు చేసిన మేళ్లుపై క్షేత్రస్థాయిలో వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. తొలుత రెండు, మూడు జిల్లాలకు కలిపి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చదవండి: (కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి ఛలోక్తి) -
ఢిల్లీ వెళ్లనున్న టీఆర్ఎస్ మంత్రుల బృందం
-
కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతులు ఆరుగాలం శ్రమించిన ధాన్యాన్ని కొనకుండా కేవలం రాజకీయం మాత్రమే చేస్తామనే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వైఖరిని సహించేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రైతులకు ఇది జీవన్మరణ సమస్య అని.. రాష్ట్రాన్ని సాధించి ముందుకు తీసుకెళ్తున్నవాళ్లం ఈ అంశంపై మౌనంగా చూస్తూ ఉండబోమని చెప్పారు. యాసంగిలో పండే వరి ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా కొనుగోలు చేసేదాకా పోరాడుతామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ శనివారం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ‘‘ధాన్యం కొనుగోలు విషయంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై గతంలోనూ వివిధ రూపాల్లో ఆందోళన చేశాం. ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ సిద్ధంకావాలి. ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు తప్పనిసరిగా హాజరుకావాలి. ఆ సమావేశం ముగిశాక సోమవారం సాయంత్రమే ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్తుంది. ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్ర మంత్రులను నిలదీద్దాం. అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేద్దాం. తెలంగాణలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్‌సభలో, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు..’’అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణభవన్‌లో జరిగే సమావేశానికి ఆహ్వానితులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఉద్యమాన్ని తలపించేలా.. రాష్ట్రంలో సాగునీటి వసతి పెరిగి కరెంటు కష్టాలు తీరడంతో ఇబ్బడి ముబ్బడిగా వరి సాగు పెరిగిందని.. ధాన్యం కొనుగోళ్ల విషయంగా గత యాసంగి, వానాకాలాల్లో కేంద్రం మెలిక పెట్టడంతో ఇబ్బంది ఎదురైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని.. తనతోపాటు రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్రం వైఖరి నిరసిస్తూ ధర్నా చేసినా స్పందన కనిపించలేదని చెప్పారు. రాష్ట్రంలో సాగునీరు ఉన్నా కేంద్ర వైఖరిని దృష్టిలో పెట్టుకుని వరి సాగు చేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. అయినా రాష్ట్ర రైతులు సుమారు 36 లక్షల హెక్టార్లలో వరిసాగు చేశారని చెప్పారు. మరో పదిహేను రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయని.. కొనుగోలు కేంద్రాలు లేకపోతే రైతులు ఇబ్బందిపడటం ఖాయమని తెలిపారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్న బీజేపీ నాయకులు.. ఈ అంశంపై మాత్రం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమాన్ని తలపించే రీతిలో కార్యాచరణ రూపొందించుకుని కేంద్రం మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యాచరణలో కేవలం పార్టీ యంత్రాంగమే కాకుండా.. రైతులను, వివిధ వర్గాలను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. బీజేపీ రాజకీయాన్ని నిలదీయాలి మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం సుదీర్ఘంగా సుమారు నాలుగు గంటలకుపైగా సాగింది. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే తలెత్తే పరిణామాలు, కేంద్రం వైఖరి, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏ తరహా కార్యాచరణ చేపట్టాలనే అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ‘‘రాష్ట్రంలో బీజేపీ అనవసర విషయాల మీద రాద్ధాంతం చేస్తోంది. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ సోషల్ మీడియా ద్వారా విషాన్ని కక్కుతున్న తీరును ప్రజలకు వివరించాలి..’’అని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. జాతీయ రాజకీయాలు, ముందస్తు ప్రస్తావన లేదు! రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్, వివిధ రాజకీయ పార్టీలు చేపడుతున్న కార్యక్రమాలు, ఇతర అంశాలను మంత్రులతో భేటీలో కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే జాతీయ రాజకీయాలు, అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల ప్రస్తావనేదీ రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల నేతలు పాదయాత్రలు, సభలతో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. అవేవీ పెద్దగా ఫలితం ఇవ్వబోవని అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. పరుగుపరుగున ఫామ్‌హౌజ్‌కు.. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సీఎం కేసీఆర్ నుంచి మంత్రులు, అధికారులు సమావేశానికి రావాలంటూ శనివారం ఉదయమే పిలుపు అందింది. అప్పటికే వేర్వేరు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో ఉన్న వీరంతా హుటాహుటిన ఫామ్‌హౌజ్‌కు వరుస కట్టారు. మంత్రులు టి.హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు సీఎం భేటీకి వచ్చారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల కార్యక్రమంలో ఉన్న మంత్రి హరీశ్‌రావు అందరికంటే చివరిగా వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సీఎం ఫామ్‌హౌజ్‌కు రావాలని మంత్రులందరికీ అకస్మాత్తుగా పిలుపు రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై వివిధ రకాల ఊహాగానాలు ప్రచారమయ్యాయి. ►ఉదయం 11.30కు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5.30 వరకు సుదీర్ఘంగా కొనసాగింది. వ్యవసాయ క్షేత్రంలోనే మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్నం భోజనం చేశారు. స్వల్ప విరామం తర్వాత తిరిగి సమావేశాన్ని కొనసాగించారు. ►టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శనివారం పొద్దునే అమెరికా పర్యటనకు బయలుదేరడంతో ఈ భేటీకి హాజరుకాలేదు. ►మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితోపాటు మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి పలు అధికారిక కార్యక్రమాల కారణంగా సమయానికి ఫామ్‌హౌజ్‌కు చేరుకోలేకపోయినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
ఆర్థిక వనరులు సమకూర్చే శాఖలతో సీఎం సమీక్ష
-
పీఆర్సీ ఇష్యూకు ఈరోజు ముగింపు
-
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మంత్రుల కీలక చర్చ
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు కీలక చర్చలు జరిపారు. ఉద్యోగుల సమ్మె నోటీస్ నేపథ్యంలో సమాలోచనలు జరిపారు. చర్చలకు రాకుండా సమ్మెకు వెళితే ప్రత్యామ్నాయం ఎలా అనే అంశంపై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. చదవండి: (సీఎం జగన్‌ను కలిసిన ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ థియరీ బెర్దెలాట్) -
కరోనాపై తెలంగాణ మంత్రుల సమీక్ష
-
లాక్‌డౌన్‌తోనే కేసులు తగ్గాయ్: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని.. ప్రభుత్వం సరైన సమయంలో లాక్డౌన్ విధించడం, వైద్యారోగ్య శాఖను సకాలంలో అప్రమత్తం చేయడం ఫలితాన్నిచ్చిందని మంత్రివర్గ భేటీలో సీఎం కేసీఆర్ అన్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడిన సమయంలో ఒడిశాకు విమానాల ద్వారా ట్యాంకర్లను పంపడం, రెమిడిసివిర్, ఇతర ఔషధాల కొరతను తీర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడంతో పరిస్థితి మెరుగైందని చెప్పారు. కోవిడ్ మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో గాంధీ, ఎంజీఎం ఆస్పత్రుల సందర్శనతో ప్రజల్లో ధైర్యం నింపగలిగామని కేసీఆర్ పేర్కొన్నారు. సుదీర్ఘకాలం లాక్డౌన్ కొనసాగితే చిన్నా, చితక వ్యాపారాలు, పనులు చేసుకునే వారు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందుల పాలవుతారన్నారు. లాక్డౌన్ ఎత్తివేసినా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా, కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని జాగ్రత్తలు తీసుకోండి ‘‘వరుసగా రెండు విద్యా సంవత్సరాలు కోవిడ్ పరిస్థితుల్లోనే కొనసాగుతుండటం పిల్లల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జూలై ఒకటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభమైనా.. భౌతిక దూరంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేలా చూడండి. విద్యా సంస్థల పునః ప్రారంభానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసి మార్గదర్శకాలు సిద్ధం చేయండి..’’ అని కేబినెట్ భేటీలో కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. వానాకాలంలో సాగు విస్తీర్ణం పెరుగుతుందనే అంచనాలు ఉన్నందున విత్తనాలు, ఎరువుల సమస్య తలెత్తకుండా మంత్రులు జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించినట్టు సమాచారం. ‘‘కరోనా సమయంలో ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నా రైతుబంధు మొత్తాన్ని ఇస్తున్నాం. ఈ విషయాన్ని మనం రైతులకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉంటే పాలన ఫలితాలు అందరికీ అందుతాయి. కరోనా నేపథ్యంలో వివిధ రంగాల్లో ఏర్పడిన స్తబ్దతను తొలగించి తిరిగి పట్టాలు ఎక్కించేందుకు అందరూ శ్రమించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించినట్టు తెలిసింది. -
రైతు సంఘాల నేతల డిమాండ్లను పరిశీలిస్తున్న కేంద్రం
-
రూ. 2,638 కోట్ల ఐజీఎస్టీ నిధులు వెంటనే ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రూ.2,638 కోట్లు రావాల్సి ఉందని, ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కోరారు. గురువారం ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఎంసీఆర్హెచ్ఆర్డీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు రావాల్సిన వాటాల గణాంకాలు ఆయన ప్రస్తావించారు. ఐజీఎస్టీ సొమ్ముతో పాటు సెటిల్మెంట్ బేస్డ్ యాన్యువల్ రిటర్న్స్ కింద మరో రూ.వెయ్యి కోట్లు రావాల్సి ఉందన్నారు. ఈ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఐజీఎస్టీపై ఎలాంటి అభ్యంతరాలూ లేవని, ఏ రాష్ట్రానికి ఎంత రావాల్సి ఉందనేదానిపైనా స్పష్టత ఉందన్నారు. దీని ప్రకారం వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన రూ.25,058 కోట్ల ఐజీఎస్టీ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా జీఎస్టీ కౌన్సిల్‌కు సిఫారసు చేయాలని కోరారు. గతంలో ఈ మొత్తాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో నిబంధనలకు విరుద్ధంగా జమ చేశారని ‘కాగ్’ఎత్తి చూపిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. కాబట్టి ఎలాంటి చర్చా లేకుండా రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని ఇవ్వాలని ఈ నెల 5న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసు చేయాలని కోరారు. దీనికి ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కన్వీనర్, బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ అంగీకరించారు. రాష్ట్రాలకు ఐజీఎస్టీ మొత్తం ఇవ్వాలనే సిఫారసును ఈ రోజే తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. 2018–19లో రూ.13,944 కోట్లు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కేంద్రం మళ్లీ కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేయడాన్ని కాగ్ తప్పు పట్టిందన్నారు. ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలన్న ఆయన తెలంగాణకు రూ.210 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. -
వదంతులు నమ్మొద్దు.. లాక్డౌన్ పొడిగింపు లేదు
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో లాక్డౌన్ పొడిగింపు ఆలోచన లేదని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే అన్నారు. అయితే లాక్డౌన్ పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు. కరోనా నియంత్రణకు లాక్డౌన్ పరిష్కారం కాదన్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో రోగులు ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే లాక్డౌన్ విధించినట్లు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఉదయం బెంగళూరులోని ఎనిమిది జోన్ల ఇన్చార్జి మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప మాట్లాడుతూ... ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులతో మాట్లాడి.. కోవిడ్, నాన్–కోవిడ్, హోం క్వారంటైన్ విషయాల గురించి చర్చించాలని మంత్రులకు సూచించారు. లక్షణాలు కనిపించని రోగులను ఇంట్లోనే క్వారంటైన్ ఉండేలా చూడాలన్నారు. అంతేకాకుండా మృతదేహాలకు కోవిడ్ పరీక్షల అనంతరం నిబంధనల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదే అన్నారు. ఇళ్లలోనే మృతి చెందిన వారికి ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు చేసి అంత్యక్రియలు త్వరగా చేస్తే బాగుంటుందని తెలిపారు. త్వరలోనే వైద్యుల భర్తీ వైద్యుల కొరత నివారించేందుకు పలు పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం చెప్పారు. ప్రతి వార్డులో వలంటీర్‌తో పాటు అంబులెన్సును కేటాయించామన్నారు. కోవిడ్ రోగులను ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన కోవిడ్ రోగులు, ఆస్పత్రిలో ఉన్న పడకల వివరాలు తెలుసుకునేందుకు వలంటీర్‌తో పాటు నోడల్ అధికారిని నియమించాలని మంత్రులకు సూచించారు. ప్రతి వార్డులో ఉన్న కల్యాణ మండపాలను గుర్తించి ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలన్నారు. (ప్లాస్మా దాతలకు కర్ణాటక ప్రోత్సాహకం) టెస్ట్‌లు పెరగాల్సిందే ప్రతి రోజు కోవిడ్ పరీక్షల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని సీఎం యడియూరప్ప సూచించారు. జనాలు గుంపులుగా ఉండే ప్రదేశాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కోవిడ్ పరీక్షల ఫలితాలు వెలువడిన వెంటనే అంబులెన్సు వారికి సమాచారం ఇచ్చి.. ఆస్పత్రికి చేరుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. రోగుల్లో 65 ఏళ్లు దాటిన వారికి ప్రత్యేక పడకలు కేటాయించాలన్నారు. లక్షణాలు లేని వారిని కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించాలని సూచించారు. -
విజయవాడలో మంత్రుల కమిటీ సమావేశం
-
అభివృద్ధిపై దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: రెండోసారి అధికారపగ్గాలు చేపట్టి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ అభివృద్ధిపై సమీక్ష జరిపారు. ఇందులో భాగంగా శనివారం మొత్తం 56 మంత్రిత్వ శాఖలతో సమావేశమై, మంత్రుల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని కోరారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, వారి ఆకాంక్షలను గౌరవించాలని కోరారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు, సాగు సహా వివిధ రంగాల విధానాలను రూపొందించాలని కోరారు. చాణక్యపురిలోని ప్రవాసి భారతీయ కేంద్రంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటిసారిగా అన్ని మంత్రిత్వ శాఖలతో సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ.. అదే స్థాయిలో మరోసారి భేటీ చేపట్టారు. కాగా, వచ్చే ఫిబ్రవరిలో బడ్జెట్ తర్వాత చేపట్టబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఈ సమావేశమే ప్రాతిపదిక కానుందని భావిస్తున్నారు. ఏం చర్చించారు? ముఖ్య పథకాల అమలు తీరు, మిషన్ 2022లో చేపట్టిన సంక్షేమ పథకాల అమలుపైనా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ప్రతి ఇంటికీ తాగునీరు, అందరికీ ఇళ్లు, ఆయుష్మాన్ భారత్, టీకా కార్యక్రమం తదితరాలను సమీక్షించారు. మంత్రుల నుంచి సలహాలు స్వీకరించడంతోపాటు ఆర్థిక మందగమనం, బడ్జెట్‌పైనా సమాలోచనలు సాగాయి. పలువురు మంత్రులపై అదనపు శాఖల బాధ్యతలతో పనిభారం ఉండటం, కొందరి పనితీరు సంతృప్తికరంగా లేకపోవడానికి సంబంధించి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దిశగా చర్చ జరిగినట్లు సమాచారం. -
బాడ్మింటన్‌కు పుట్టినిల్లు తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బాడ్మింటన్‌కు తెలంగాణ పుట్టినిల్లుగా ఆవిర్భవించిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వివిధ క్రీడల్లో ప్రపంచ స్థాయి క్రీడాకారులను అందిస్తున్న తెలంగాణ దేశానికే గర్వకారణంగా నిలుస్తోందన్నారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో క్రీడలకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తెలంగాణ నుంచి క్రీడా రంగం కోసం రూ. 218 కోట్ల ప్రతిపాదనలు పంపితే అందులో రూ.19 కోట్లే విడుదల చేశా రని గుర్తు చేశామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను అందిస్తున్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు కేటాయించాలని కోరామన్నారు. -
వరుస భేటీలతో హస్తినలో ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు ఢిల్లీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. పాలక, విపక్షాలు వరుస భేటీలతో ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. కాంగ్రెస్ సహా 20కి పైగా విపక్ష పార్టీలు మంగళవారం మధ్యాహ్నం సమావేశమై ఫలితాల అనంతరం ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై విస్తృతంగా చర్చించాయి. ఈవీఎంలపై సందేహాలు వ్యక్తమవుతున్న క్రమంలో తొలుత ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని విపక్ష పార్టీలు ఈసీని కలిసి వినతిపత్రం సమర్పించాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే గెలుపొంది తిరిగి అధికారం చేపడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో బీజేపీలో జోష్ నెలకొంది. విస్పష్ట ఆధిక్యత వచ్చినా, రాకున్నా ఎన్డీయే పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్న కమలనాధులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఎన్డీయే మంత్రుల భేటీలో ఎగ్జిట్ పోల్స్ సమీక్షతో పాటు ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దానిపై సంప్రదింపులు జరిపారు. ఇక మంగళవారం రాత్రి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు బీజేపీ చీఫ్ అమిత్ షా విందు ఇచ్చారు. ఈ విందు భేటీలో నితీష్ కుమార్, ఉద్ధవ్ థాకరే, రాం విలాస్ పాశ్వాన్ సహా పలువురు ఎన్డీయే నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాల అనంతరం చేపట్టాల్సిన కసరత్తుపై వారు సంప్రదింపులు జరిపారు. ఇక ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఈనెల 23న వెల్లడవనున్న ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. -
రేపు మంత్రులతో కేసీఆర్ కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ ఈ విషయంలో ఒక్కఅడుగు ముందే ఉంది. బుధవారం సాయంత్రం 4గంటలకు ప్రగతి భవన్లో మంత్రులతో కేసీఆర్ అత్యవసరంగా సమావేశం కానున్నారు. రేపు మంత్రులు అంతా అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటనపై, సెప్టెంబర్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభపై కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. -
మంత్రి సభలో మహిళ ఆత్మహత్యాయత్నం
బెల్లంపల్లి: ముగ్గురు రాష్ట్ర మంత్రుల సాక్షిగా భూమి కోసం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం జరిగింది. నిండు సభలో హెయిర్‌డై తాగి బలవన్మరణానికి యత్నించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంపీలు, ఎమ్మెల్యేలు బెల్లంపల్లి పర్యటనకు వచ్చారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కొత్తగా నిర్మించిన కార్యాలయ నూతన భవనానికి మంత్రి హరీశ్‌రావు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతుండగా.. బెల్లంపల్లి సుభాష్‌నగర్‌బస్తీకి చెందిన ఆరే వరలక్ష్మి అనే మహిళ సూపర్వాస్మల్ 33 హెయిర్‌డైని తాగి పడిపోయింది. పోలీసులు అంబులెన్స్‌లో ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా బాధితురాలు వరలక్ష్మి ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడింది. ‘నా తండ్రి పురంశెట్టి బాపు తాండూర్ శివారులోని సర్వే నం.699/1లో ఉన్న ఒక ఎకరం 42 సెంట్ల పట్టా భూమిని నాకు కట్నంగా ఇచ్చారు. ఆ భూమిని తాండూర్ జెడ్పీటీసీ మంగపతి సురేశ్‌బాబు కబ్జా చేసుకున్నాడు. 2011 నుంచి జెడ్పీటీసీ నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆక్రమణకు గురైన భూమి విషయమై హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. ఇంత వరకు జెడ్పీటీసీ సురేశ్‌బాబు భూమి మాత్రం అప్పగించలేదు. జెడ్పీటీసీకి మద్దతుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బెల్లంపల్లి టీఆర్ఎస్ నాయకులు పసుల సురేశ్ ఫోన్ చేసి రోజూ భూమి విడిచిపెట్టాలని బెదిరిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు దృష్టికి నా సమస్యను తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే హెయిర్‌డైని తాగాను’. పరామర్శించిన కలెక్టర్.. సభ ముగిసిన అనంతరం వరలక్ష్మిని కలెక్టర్ జగన్మోహన్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఆర్డీవో ఆయేషామస్రత్‌ఖానం, తహసీల్దార్ కె.శ్యామలదేవి ప్రభుత్వాస్పత్రితో బాధితురాలిని పరామర్శించారు. కలెక్టర్ జగన్మోహన్ ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ చంద్రమోహన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెతో మాట్లాడుతూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
బడ్జెట్‌పై నేడు ఢిల్లీలో మంత్రుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో పాల్గొనేందుకు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. స్థూల ఆర్థిక విధానం, ద్రవ్య సుస్థిరతకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంపై దృష్టి సారించనున్నారు. -
సీఎంకు చెక్ పెట్టేందుకు బొత్స ప్రయత్నాలు
-
మంత్రుల సమావేశంలో బొత్స నిరసన గళం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జరిగిన సీమాంధ్ర మంత్రుల సమావేశంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నిరసనగళం వినిపించారు. బిల్లును తిరస్కరించాలన్న తీర్మానం సరికాదన్నారు. బిల్లుపై చర్చలో పాల్గొనమని మనమే చెప్పి, ఇప్పుడు తిరస్కరించాలంటూ నోటీసు ఇవ్వడం భావ్యమా? అని బొత్స ప్రశ్నించారు. సభలో ఇప్పటి వరకూ మట్లాడని వారందరూ కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమేరకు స్పీకర్‌కు విజ్ఞప్తిచేశామని చెప్పారు. అవసరమైతే గడువు పెంచే చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖరాసినట్లు బొత్స తెలిపారు.