
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఈ విషయంలో ఒక్కఅడుగు ముందే ఉంది. బుధవారం సాయంత్రం 4గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రులతో కేసీఆర్ అత్యవసరంగా సమావేశం కానున్నారు. రేపు మంత్రులు అంతా అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటనపై, సెప్టెంబర్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభపై కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment