ఆ నటుడి కూతురా? నమ్మలేం.. డీఎన్‌ఏ టెస్ట్‌ చేయండి! | Farah Khan wants a DNA test of Ananya | Sakshi
Sakshi News home page

ఆ నటుడి కూతురా? నమ్మలేం.. డీఎన్‌ఏ టెస్ట్‌ చేయండి!

Published Tue, Aug 22 2017 1:41 PM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM

ఆ నటుడి కూతురా? నమ్మలేం.. డీఎన్‌ఏ టెస్ట్‌ చేయండి!

ఆ నటుడి కూతురా? నమ్మలేం.. డీఎన్‌ఏ టెస్ట్‌ చేయండి!

బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య (18) ఇప్పుడు సోషల్‌ మీడియాలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది. అనన్య ఫొటోను ఆమె తల్లి భావన పాండే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. కాసేపట్లోనే ఈ ఫొటో వైరల్‌గా మారింది. అనన్య అందం అదుర్స్‌ అంటూ ఎంతోమంది నెటిజన్లు కితాబిచ్చారు. అయితే, అంతకుమించి అన్నట్టు ఈ ఫొటోపై బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫర్హా ఖాన్‌ బాంబులాంటి కామెంట్‌ చేశారు. అనన్య చుంకీపాండే కూతురంటే నమ్మలేం.. డీఎన్‌ఏ పరీక్ష చేయించాలంటూ ఆమె పేర్కొన్నారు. సరదాగా ఆటపట్టించేందుకు ఆమె పెట్టిన ఈ కామెంట్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయింది.

క్యూట్‌గా ఉన్న అనన్య ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1700లకుపైగా లైకులు వచ్చాయి. ఎంతోమంది కామెంట్‌ పెట్టారు. ఫర్హా ఖాన్‌ కూడా సరదాగా స్పందిస్తూ.. 'దయ చేసి డీఎన్‌ఏ పరీక్ష చేయించండి. తను చుంకీ కూతురంటే నమ్మలేం. చాలా లవ్లీగా ఉంది' అంటూ లాఫ్టర్ ఎమోజీతో కామెంట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement