ఫరాఖాన్‌ను అనుకరించిన కమెడియన్‌ కూతురు | Farah Khan Shares Johnny Lever Daughter Video On Twitter | Sakshi
Sakshi News home page

ఎంత సరదాగా ఉందో.. తనకి నా హగ్‌: ఫరాఖాన్‌

Published Wed, Jul 8 2020 3:47 PM | Last Updated on Wed, Jul 8 2020 4:07 PM

Farah Khan Shares Johnny Lever Daughter Video On Twitter - Sakshi

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ కమెడియన్‌ జాన్‌ లివర్‌ కూతురు అచ్చం బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌లా మాట్లాడుతూ తనని అనుకరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  తనని కౌగిలించుకోవాలని ఉందంటూ ఫర్హా ఈ  వీడియోను ట్విటర్‌లో బుధవారం పంచుకున్నారు. దీనికి ఫర్హా ‘ఎంత సరదాగా చేశారు... మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉంది. అచ్చం నాలాగే మాట్లాడుతున్నారు. మీలో చాలా ప్రతిభ ఉంది’ అంటూ #IHateMyVoice అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేసి ట్వీట్‌‌ చేశారు. (చదవండి: కనీసం ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి: నటి)

5 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో జాన్‌ కూతురు అచ్చం ఫరాలా మాట్లాడమే కాకుండా తనలా నటిస్తూ.. తన దర్శకత్వం, కొరియోగ్రఫీని కూడా అనుకరిస్తున్న ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ఆమె అచ్చం మీలా మాట్లాడుతుంది. అదే వాయిస్‌ కూడా’. ‘తను అద్భుతం’ ‘తనకు మంచి భవిష్యత్తు ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. వారం క్రితం జాన్‌ లీవర్‌ షేర్‌ చేసిన ఈ వీడియోకు ఇప్పటీ వరకు 3.8 లక్షలకు పైగా వ్యూస్‌, వచ్చాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement