Johnny Lever
-
ఫరాఖాన్‌ను అనుకరించిన కమెడియన్ కూతురు
ముంబై: బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ జాన్ లివర్ కూతురు అచ్చం బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌లా మాట్లాడుతూ తనని అనుకరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనని కౌగిలించుకోవాలని ఉందంటూ ఫర్హా ఈ వీడియోను ట్విటర్లో బుధవారం పంచుకున్నారు. దీనికి ఫర్హా ‘ఎంత సరదాగా చేశారు... మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఉంది. అచ్చం నాలాగే మాట్లాడుతున్నారు. మీలో చాలా ప్రతిభ ఉంది’ అంటూ #IHateMyVoice అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసి ట్వీట్ చేశారు. (చదవండి: కనీసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి: నటి) 5 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో జాన్ కూతురు అచ్చం ఫరాలా మాట్లాడమే కాకుండా తనలా నటిస్తూ.. తన దర్శకత్వం, కొరియోగ్రఫీని కూడా అనుకరిస్తున్న ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ఆమె అచ్చం మీలా మాట్లాడుతుంది. అదే వాయిస్ కూడా’. ‘తను అద్భుతం’ ‘తనకు మంచి భవిష్యత్తు ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వారం క్రితం జాన్ లీవర్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటీ వరకు 3.8 లక్షలకు పైగా వ్యూస్, వచ్చాయి. This is TOOO FUNNY.. https://t.co/NY2LTqnJ1R @Its_JamieLever Ur sooo talented! Want to hug u n gag u at the same time😂 #ihatemyvoice — Farah Khan (@TheFarahKhan) July 8, 2020 -
కామెడీ కింగ్
-
ఒంగోలుకు వచ్చిన జానీ లీవర్
ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లీవర్ ఆదివారం ఒంగోలు పట్టణానికి వచ్చారు. జానీలీవర్ బందువు ఆనారోగ్యంతో ఉండంతో.. పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిసింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న ఓ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న ఆయన ఒంగోలుకు వచ్చి వెళ్లారు. జానీ లీవర్ స్వగ్రామం ప్రకాశం జిల్లా కనిగిరి. ఆయన తల్లిదండ్రులు ముంబైకి వలస వెళ్లారు. ఇప్పటికీ వారి బంధువులు కనిగిరి ప్రాంతంలో ఉన్నారు. -
ప్రేమే జీవననాదం.. ప్రేమతోనే బతకండి
న్యూఢిల్లీ: ‘జీవితంలో కోల్పోయిన మనశ్శాంతిని, తిరిగి పొందడానికి ప్రేమ ఒక్కటే మార్గం. గతాన్ని మరిచిపోయి..ప్రేమను పంచండి. ప్రేమలోనే జీవిం చాల’ంటూ ప్రముఖ హస్యనటుడు జానీ లివర్ తీహార్ జైలు ఖైదీలకు పిలపు ఇచ్చారు. తీహార్ జైలు-నంబర్ 1లోని ఖైదీల వినోదం కోసం ‘హృదయాల స్పందన’ పేరుతో నిర్వహించిన సంగీత విభావరిలో ఆయన పాల్గొన్నారు. సంగీతంతోపాటు హస్యాన్ని పండించారు. ఖైదీల్లో నవ్వులు పూయించారు. చాలా గొప్ప అనుభూతి... హస్యనటుడు జానీ లివర్ మాట్లాడుతూ ‘మీరంతా గొప్పవాళ్లు.. ఇక్కడ ప్రేమపూర్వకంగా ప్రదర్శన ఇస్తున్నా. ఇందుకు నాకు సంతోషంగా ఉంది. ఖైదీల సంతోషం కోసం జైలు అధికారుల తోడ్పాటుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. భవిష్యత్‌లోనూ ఇలాంటి అవకాశాలను గొప్పగానే భావిస్తా. మీ అందరికీ ప్రేమ అవసరం. జీవితంలో పోగొట్టుకున్నదేదైనా తిరిగి సాధించడానికి ప్రేమ ఒక్కటే సాధనమని అన్నారు. సంగీతం సార్వత్రికం బాలీవుడ్ ప్లేబ్యాక్ గాయకుడు సాప్న ముఖర్జీ, సంగీత దర్శకులు అమిత్, సుమీత్ కుమార్, ఆయన కుమారులు కిషోర్‌కుమార్, ఇంకా ప్రముఖ సెలబ్రిటీలు వారి ప్రతిభా పాటవాలతో ఖైదీలను అలరింపజేశారు. సంగీతం సార్వత్రికమైనది. ప్రపంచంలో ఎవరైనా, ఎక్కడైనా సంగీత ప్రియులు ఉంటారు. ఖైదీలు సంతోషకరమైన వాతావరణంలో సంగీతాన్ని ఆస్వాదించారు. ఇదే మొదటి ప్రోగ్రాం జైల్ నంబర్-1 సూపరింటెండెంట్ రాజేష్ చౌహాన్ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాన్ని జైలులో ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి, ఇలాంటి కార్యక్రమాల వల్ల జైలు ప్రాంగణంలో ఖైదీల్లో ఉన్న ప్రాంతీయత స్వభావం, నిస్సాయతను దూరం అవుతాయని, ఖైదీల్లో మార్పుతోపాటు, వారి సత్ప్రవర్తనకు దోహదపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు అధికారుల నుంచి లేదా జైళ్ల నిధులను వినియోగించలేదన్నారు. కళాకారులు స్వచ్ఛందంగా నిర్వహించారని చెప్పారు. హాజరైన ప్రముఖులు కళాకారులు, నిర్వాహకులను అభినందించారు. ఢిల్లీ జైళ్ల విభాగం డీజీ అలోక్ వర్మ, డీఐజీ ముఖేష్ ప్రసాద్, జైల్ నంబర్-1 సూపరింటెండెంట్ రాజేష్ చౌహాన్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. తీహార్ జైలులో మొదటిసారి సంగీత విభావరి ఖైదీల్లో మార్పులు తేవడానికి తీహార్ జైలు అధికారులు కొంతకాలంగా కృషి చేస్తున్నారు. క్షణికావేశంలో, తెలియక చేసిన తప్పులు, ఇంకా ఎన్నోరకాల కారణాలతో జైలు శిక్ష అనుభవించేవారు, జైలు నుంచి వెళ్లిన తరువాత మరోసారి ఎలాంటి పొరపాట్లు చేయకుండా మంచి జీవనాన్ని అనుభవిం చేలా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్లి శిక్షా కాలంలో ‘మనోవేధనకు గురికాకుండా ఉల్లాసంగా ఉండేందుకు సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రముఖ బాలీవుడ్ కళాకారులు స్వచ్ఛందంగా సహకరిం చారు. శిక్ష కాలం పూర్తయిన తరువాత ఖైదీలు ప్రేమతో జీవించేలా, వారి మనోభావాల్లో మార్పు రావాలని ఆకాంక్షిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు. -
తీహార్ జైల్లో ఖైదీలతో జానీ లివర్!
న్యూఢిల్లీ: జీవితంలో కోల్పోయిన మనశ్శాంతిని, తిరిగి పొందడానికి ప్రేమ ఒక్కటే మార్గం. గతాన్ని మరిచిపోయి.. ప్రేమను పంచండి. ప్రేమలోనే జీవించాలని ప్రముఖ హస్యనటుడు జాన్ లివర్ తీహార్ జైలు ఖైదీలకు పిలపు ఇచ్చారు. తీహార్ జైలు-నంబర్ 1లోని ఖైదీల వినోదం కోసం సోమవారం ‘హృదయాల స్పందన’ అనే పేరుతో సంగీత విభావరి నిర్వహించారు. సంగీతంతోపాటు హస్యాన్ని పండించారు. ఖైదీల్లో నవ్వులు చిందించారు. హస్యనటుడు జాన్ లివర్ మాట్లాడుతూ ‘మీరంతా గొప్పవాళ్లు.. ఇక్కడ ప్రేమపూర్వకంగా ప్రదర్శన ఇస్తున్నా. ఇందుకు నాకు సంతోషంగా ఉంది. ఖైదీల సంతోషం కోసం జైలు అధికారుల తోడ్పాటుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. భవిష్యత్‌లోనూ ఇలాంటి అవకాశాలను గొప్పగానే భావిస్తా. మీ అందరికీ ప్రేమ అవసరం. జీవితంలో పోగొట్టుకున్నదేదైనా తిరిగి సాధించడానికి ప్రేమ ఒక్కటే సాధనమని అన్నారు.పాత జ్ఞాపకాలను మరిచిపోయి ప్రేమను పంచండి'అని జానీ లివర్ తెలిపాడు. దీనికి కిషోర్ కుమార్ కుమారులు అమిత్ కుమార్, సుమిత్ కుమార్ లు కూడా హాజరైయ్యారు.