తీహార్ జైల్లో ఖైదీలతో జానీ లివర్!
న్యూఢిల్లీ: జీవితంలో కోల్పోయిన మనశ్శాంతిని, తిరిగి పొందడానికి ప్రేమ ఒక్కటే మార్గం. గతాన్ని మరిచిపోయి.. ప్రేమను పంచండి. ప్రేమలోనే జీవించాలని ప్రముఖ హస్యనటుడు జాన్ లివర్ తీహార్ జైలు ఖైదీలకు పిలపు ఇచ్చారు. తీహార్ జైలు-నంబర్ 1లోని ఖైదీల వినోదం కోసం సోమవారం ‘హృదయాల స్పందన’ అనే పేరుతో సంగీత విభావరి నిర్వహించారు. సంగీతంతోపాటు హస్యాన్ని పండించారు. ఖైదీల్లో నవ్వులు చిందించారు.
హస్యనటుడు జాన్ లివర్ మాట్లాడుతూ ‘మీరంతా గొప్పవాళ్లు.. ఇక్కడ ప్రేమపూర్వకంగా ప్రదర్శన ఇస్తున్నా. ఇందుకు నాకు సంతోషంగా ఉంది. ఖైదీల సంతోషం కోసం జైలు అధికారుల తోడ్పాటుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. భవిష్యత్‌లోనూ ఇలాంటి అవకాశాలను గొప్పగానే భావిస్తా. మీ అందరికీ ప్రేమ అవసరం. జీవితంలో పోగొట్టుకున్నదేదైనా తిరిగి సాధించడానికి ప్రేమ ఒక్కటే సాధనమని అన్నారు.పాత జ్ఞాపకాలను మరిచిపోయి ప్రేమను పంచండి'అని జానీ లివర్ తెలిపాడు. దీనికి కిషోర్ కుమార్ కుమారులు అమిత్ కుమార్, సుమిత్ కుమార్ లు కూడా హాజరైయ్యారు.