బిగ్ బి అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ఘనవిజయాల్లో హమ్ సినిమా ఒకటి. ఈ సినిమాలో అమితాబ్ చెప్పిన డైలాగ్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో అమితాబ్ లుక్ ను ఇప్పటికీ అబిమానులు ఫాలో అవుతుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హమ్ సినిమాలో అమితాబ్ గెటప్ లో దర్శనమిచ్చింది.
ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న లిప్ సింగ్ బ్యాటిల్ కోసం బాలీవుడ్ నటి శిల్పాశెట్టి అమితాబ్ గెటప్ లో అలరించారు. హమ్ సినిమాలోని జుమ్మా చుమ్మా పాటకు బిగ్ బి స్టైల్ లో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది శిల్పా. తన సోషల్ మీడియాలో పేజ్ లో బిగ్ బి గెటప్ కు సంబంధించిన ఫొటోతో పాటు ఓ వీడియోను పోస్ట్ చేసిన శిల్పా, నాజీవితంలోనే అతి కష్టమైన పని అంటూ కామెంట్ చేసింది.