మీ పిల్లలు హిందువులా? ముస్లిములా? | Your children Hindus or Muslims? | Sakshi
Sakshi News home page

మీ పిల్లలు హిందువులా? ముస్లిములా?

Published Tue, Jan 10 2017 12:13 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మీ పిల్లలు హిందువులా? ముస్లిములా? - Sakshi

మీ పిల్లలు హిందువులా? ముస్లిములా?

ఫీల్‌ గుడ్‌

కొత్త సంవత్సరంలో గడిచింది పది రోజులే అయినా, మీరిప్పుడు ‘బ్యూటిఫుల్‌ ఆన్సర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – 2017’ ను వినబోతున్నారు. అంటే దీనర్థం 31 డిసెంబర్‌ 2017 వరకు ఇంత అందమైన సమాధానాన్ని మీరు వినే అవకాశమే లేదు! ‘ఫరాఖాన్‌ అండ్‌ ఫ్యామిలీ’ జనవరి ఒకటిన అరిజోనా (యు.ఎస్‌.) లోని ‘గ్రాండ్‌ కేనియన్‌’ శిఖరం చేరుకుంది. ఫరా తెలుసు కదా. బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్, డైరెక్టర్‌! ఆమె, ఆమె భర్త శిరీశ్‌ కుందర్, పిల్లలు జార్, అన్య, దివా.. గ్రాండ్‌ కొండలోయ పైకి చేరుకున్నాక.. తల్లీ పిల్లల్ని ఫోటో తీసి దాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు శిరీశ్‌. ఫొటో అందంగా ఉంది. (పైన మీరు చూస్తున్నదే). ఆ ఫొటో కింద శిరీశ్‌ రాసిన క్యాప్షన్‌ సరదాగా ఉంది.

‘‘నన్ను లోయలోకి తోసి, నా ఫ్యామిలీ.. శిఖరంపై సగర్వంగా నిలుచుంది. నేనెక్కడ ఉన్నానో తెలియడం లేదు. 2017 వచ్చేసిందా?’’ అని పోస్ట్‌ చేశాడు శిరీశ్‌. రెస్పాన్స్‌గా చాలా ట్వీట్లు వచ్చాయి. గ్రాండ్‌ కేనియన్‌ బాగుందనీ, ఫొటో బాగుందనీ, ఫరా బాగున్నారనీ, పిల్లలు చక్కగా ఉన్నారనీ, ఫొటో కాప్షన్‌ బాగుందనీ.. చాలా ట్వీట్లు వచ్చాయి. వీటికి భిన్నమైన ట్వీట్‌ కూడా ఒకటి వచ్చింది!‘‘మీ పిల్లలు హిందువులా? ముస్లింలా?’’..  అన్న ట్వీట్‌ అది. ఫరా ముస్లిం. శిరీశ్‌ హిందూ. అందుకే ఆ ట్వీటర్‌ అలా అడిగాడు.మరి దానికి  శిరీశ్‌ ఏమని సమాధానం చెప్పి ఉంటాడు? గెస్‌ చెయ్యండి. ఈ లోపు ఈ దంపతుల గురించి కొన్ని ముచ్చటలు చెప్పుకుందాం. ఫరా కన్నా శిరీశ్‌ 8 ఏళ్లు చిన్న. 2004లో వీళ్ల మ్యారేజీ అయింది. ఫరా ముంబై అమ్మాయి. శిరీశ్‌ మంగుళూరు అబ్బాయి. ఫిల్మ్‌ రైటర్, ప్రొడ్యూసరు, డైరెక్టర్, ఎడిటర్, కంపోజర్‌. ‘మై హూ నా’ షూటింగ్‌లో వీళ్ల పరిచయం జరిగింది. 2008లో ఫరాకు ఆమె 43 ఏళ్ల వయసులో ‘ట్రిప్లెట్స్‌’ పుట్టారు. ఒకే డెలివరీలో ముగ్గురు పిల్లలు. ఫరాకు ప్రస్తుతం 51, శిరీశ్‌కు 43. ఫరా బర్త్‌ డే జనవరి 9న. నిన్ననే.

సరే, ఇంతకీ ఆ ట్వీటర్‌ క్వొశ్చన్‌కి, శరీశ్‌ ఏమని ఆన్సర్‌ ఇచ్చాడు?ట్వీటర్‌ ప్రశ్న: మీ పిల్లలు హిందువులా? ముస్లిములా?శిరీశ్‌ ఆన్సర్‌: అది నెక్ట్స్‌ వచ్చే పండుగను బట్టి ఉంటుంది. గత వారం నా పిల్లలు క్రిస్టియన్లు. వావ్‌! ఎంత క్యూట్‌ రిప్లయ్‌! టచ్‌ చేశావ్‌ శిరీశ్‌. ఆన్సర్‌ ఆఫ్‌ ది ఇయర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement